Site icon NTV Telugu

Congress: రేపే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం!

Congress

Congress

Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్‌ ఆశలు ఆవిరైపోయాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం.. కాంగ్రెస్‌ 64, బీఆర్ఎస్‌ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో విజయం సాధించాయి. సీపీఐ కూడా కాంగ్రెస్‌తో పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార, ప్రభుత్వం ఏర్పాటు సోమవారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. ఇదిలా ఉండగా.. ఆదివారం రాత్రి సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉంది.

Read Also: Telangana Election Results: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖాతా తెరవని కమలం.. ఇద్దరు ఎంపీల పరాజయం!

64 సీట్లు సాధించి సాధారణ మెజార్టీతో కాంగ్రెస్ రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. తెలంగాణలో 119 స్థానాలు ఉండగా.. సర్కారు ఏర్పాటుకు 60 సీట్లు అవసరం. కాంగ్రెస్ 64 గెలుచుకుని సాధారణ మెజారిటీని సాధించింది. రేపు ఉదయం కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. సీఎం ఎంపికపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ నేతలు సేకరించనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణకు చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను అధిష్ఠానానికి పంపిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

Exit mobile version