Former Sews Bags for Bulls: తెలుగు రాష్ట్రాలు చలికి గజగజ వణుకుతున్నాయి. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతుండటంతో.. ఉష్ణోగ్రతలు పడిపోతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగి.. ప్రజలు గజగజ వణుకుతున్నారు. తీవ్ర చలికి ఇంటిలో ఉన్నప్పటికీ జనంలో వణుకు మాత్రం తగ్గడం లేదు. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ ఇంకా తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
Also Read: Cold Waves: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి..
ఆదిలాబాద్ జిల్లాలో గత 2-3 రోజులుగా చలి తీవ్రత భారీగా పెరిగింది. దాంతో జనాలు ఇంటి నుంచి బయటికి రావడానికే భయపడుతున్నారు. భీంపూర్ మండలం అర్లిటి గ్రామంలో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరుకున్నాయి. తాజాగా 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దాంతో ఓ రైతు తన పశువులను చలి నుంచి రక్షించుకునేందుకు ఏకంగా వాటికి గోనె సంచులు కుట్టించాడు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు తన రెండు ఎద్దులకు గోనె సంచుల తొడుగులు వేశాడు. ఇందుకుసంబంధించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Media error: Format(s) not supported or source(s) not found
Download File: https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2023/12/WhatsApp-Video-2023-12-21-at-8.40.22-AM.mp4?_=1