NTV Telugu Site icon

CM Revanth Reddy: ఈరోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుంది

Revanth

Revanth

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కుల గణన ప్రక్రియ ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా ప్రధానిపై ఒత్తిడి పెరగనుందని, అన్ని రాష్ట్రాల్లో కూడా కుల గణన చేయాలని డిమాండ్ రాబోతోందని తెలిపారు. ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని సీఎం అన్నారు. భవిష్యత్‌లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే డాక్యుమెంట్ దేశానికి రిఫరెన్స్ అవుతుందని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ తమ ప్రభుత్వమే ఈ గణన చేపట్టిందని, 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో, ఎవరు చేసినారో తాము చెప్పలేమని వ్యాఖ్యానించారు.

Also Read: PM Letter: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‭కి ప్రధాని నరేంద్ర మోడీ లేఖ

సుప్రీంకోర్టు సూచించినట్లుగానే కుల గణనను అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. కుల గణన ఆధారంగానే సీట్ల కేటాయింపు, పదవుల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందులో క్రిమిలేయర్ విధానం అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే, మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సీఎం అన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే తమ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని, మిగిలిన విషయాలకు తావులేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కుల గణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, భవిష్యత్‌లో దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అన్నారు.