Duddilla Sridhar Babu : సెక్రటేరియట్‌లో బిల్డ్ నౌ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ప్రభుత్వం యొక్క నూతన సమగ్ర భవనాలు , లేఅవుట్ల ఆమోదానికి సంబంధించిన వ్యవస్థ బిల్డ్ నౌ. ఇది అత్యాధునిక ప్రజాపాలన దిశగా ఒక విప్లవాత్మక అడుగు. భారతదేశంలోనే వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూట్నీ వ్యవస్థ ఇది. ఈ నూతన వ్యవస్థ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. అనుమతులు, డ్రాయింగ్ స్కూట్నీ ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. పనితీరులో ఇది ఒక బెంచ్ మార్క్ గా నిలుస్తుంది. ఈ అత్యాధునిక వ్యవస్థ భవన నిబంధనలు , అనుమతులకు సంబంధించి ప్రజల అవసరాలను వేగంగా తీర్చడంతో పాటు విశ్వసనీయంగా , స్నేహపూర్వకంగా ఉంటుంది. ప్రజలు , నిర్మాణదారుల కోసం శక్తివంతమైన, అధునాతన వ్యవస్థ.
Priyanka Jain: శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక.. ఇంతకు ఏమైందంటే ?
ప్రజలు , నిర్మాణదారుల కోసం శక్తివంతమైన, ఆధునాతన వ్యవస్థ భారత దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూట్నీ వ్యవస్థగా బిల్డ్ నౌ నిలుస్తుంది. అత్యాదునిక టెక్నాలజీతో ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. ఈ కొత్త వ్యవస్థ అనేక విప్లవాత్మక లక్షణాలను కలిగిఉంది: బహుళ అంతస్తుల భవనాలను కూడా 5 నిమిషాల్లో ప్రాసెస్ చేయగల వేగంతమైన స్కూట్నీ ఇంటిన్ ఇది. ప్రజలు పలు విభాగాలకు వెళ్లడం , వివిధ పోర్టల్స్ మారే అవసరం లేకుండా అనుమతి ప్రక్రియ అంతా ఒకే చోట పూర్తి చేయగల ఏకీకృత సింగిల్ విండో ఇంటర్ పీస్ ఇది. ప్రజలు తమ భవనాలను నిర్మాణానికి ముంది వాస్తవికంగా అగ్మెంటెడ్ రియాలిటీ 3డీ విజువలైజేషన్ ద్వారా చూడొచ్చు. భవన నిబంధనలపై తక్షణం, కచ్చితమైన మార్గదర్శకాలను ఈ AI ఆధారిత పవర్డ్ అసిస్టెంట్ అందిస్తుంది. ప్రతి దరఖాస్తును దృవీకరించి ట్రాక్ చేసేందుకు నమ్మకాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ అవాకశం కల్పిస్తుంది. డేటా ఆధారిత పాలనను చిత్తశుద్ధితో అమలు చేస్తుంది.
అయితే ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అభివృద్ధి నివేదికను ప్రజల ముందు పెడుతున్నామన్నారు. రికార్డు స్థాయిలో పట్టణాభివృద్ధి జరిగిందని, హైదరాబాద్ పర్ క్యాపిటల ఇంకమ్19.3 cagr చొప్పున పెరుగుతుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ ఇప్పటికి మొదటి స్థానంలో ఉందని, Gsdp గత 15 సంవత్సరాలుగా తెలంగాణ అనివాల్ గ్రోత్ రేట్ పెరిగిందన్నారు. చాలా మంది కి ఉపాధి కల్పన.. ప్రతీ ఇంట్లో ఆదాయం పెరిగిందని, తమ మధ్య సిద్ధాంత పరంగా రాజకీయ విధానాలు వేరుగా ఉన్న… ప్రగతిశీల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు శ్రీధర్‌బాబు. గృహ సముదాయాల అమ్మకాల్లో కూడా హైదరాబాద్ ముందంజలో ఉందని, హోమ్ లోన్స్ అంశంలో కూడా హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, 45 వేల ఉద్యోగాలు ఐటీలో ఇచ్చాము. ప్రస్తుతం 9.7 లక్షల మంది ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో పని చేస్తున్నారన్నారు.
అంతేకాకుండా..’అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐటి సెంటర్లు హైదరాబాద్ లో ఉన్నాయి. రాబోయే మూడేళ్ళ లో 34 మిలియన్ స్క్వార్ ఫీట్ నుంచి 37 మిలియన్ల స్కైర్ ఫీట్ ఆఫీస్ స్పెస్ కావాలని అడుగుతున్నారు. 1.37 వేల రెసిడెన్షియల్ యూనిట్లు కావాలని కోరుతున్నారు. 23 శాతం బిల్డింగ్ పర్మిషన్స్ అధికంగా ఇచ్చాము. హైదరాబాద్ నగరం ప్రపంచంలోని ఐదు నగరాల్లో ఒకటిగా నిలిచింది. హైదరాబాద్ మహా నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. సరళికృత అడ్మిస్ట్రీషన్ రిఫామ్స్ తేవాలని భావిస్తున్నాము. పౌర సేవలను సరళీకృతం చేస్తాము.’ అని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.
AP Cabinet: సమీకృత పర్యాటక పాలసీకి ఆమోదం.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు