Site icon NTV Telugu

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో సవాల్‌.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్..

Delhi

Delhi

BC Reservations: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు పాస్ అయ్యాక, ఉత్తర్వులు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్‌రెడ్డి సెప్టెంబరు 29న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఫోన్‌లో సంభాషించారు. సుప్రీంకోర్టు విచారణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని డిప్యూటీ సీఎంను ఆదేశించారు. దీంతో ఈరోజు రాత్రి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి బయలు దేరనున్నారు. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు నేపథ్యంలో ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ప్రభుత్వం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై భట్టి విక్రమార్కతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వి.. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించనున్నారు.

READ MORE: SBI Recruitment 2025: డిగ్రీ అర్హతతో.. ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు రెడీ.. భారీ వేతనం..

తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయస్థానాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ప్రకారం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు మెంబర్‌ స్థానాల్లో ఏకంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించుతాయని వాదిస్తూ, వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన తీర్పులో రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదని స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆయన వాదన. ఈ పిటిషన్‌పై  రేపు  సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఇక మరోవైపు, బీసీ రిజర్వేషన్ల అంశంపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 8న విచారణకు తీసుకోనుంది. ఇప్పటికే హైకోర్టు, “కోర్టులో కేసు ఉన్న సమయంలో ఎన్నికల ప్రక్రియను ఎందుకు ముందుకు తీసుకువెళ్తున్నారు?” అని ప్రశ్నిస్తూ, ఎన్నికల ప్రకటనపై ప్రశ్నలు లేవనెత్తింది. అసెంబ్లీ తీర్మానం ఇంకా గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల కూడా కోర్టు ఆక్షేపణలు వ్యక్తం చేసింది.

READ MORE: SBI Recruitment 2025: డిగ్రీ అర్హతతో.. ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు రెడీ.. భారీ వేతనం..

 

Exit mobile version