ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఇటీవల భారీ వేతనంతో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 122 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. అదనంగా, వారు బ్యాలెన్స్ షీట్ విశ్లేషణ, మదింపు, క్రెడిట్ ప్రతిపాదనల అంచనా, క్రెడిట్ పర్యవేక్షణలో నైపుణ్యాలను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
Also Read:PriyaPrakashVarrier : ప్రియా ప్రకాష్.. అందాలు శెభాష్
అభ్యర్థులను 100 మార్కులకు నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.85,920 నుంచి రూ.1,05,280 వరకు జీతం అందిస్తారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750గా నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఇచ్చారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 15 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.