BC Reservations: తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణ.. తీర్పుపై తీవ్ర ఉత్కంఠ!
- తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణ
- విచారణ జరపనున్న సందీప్ మెహతా ధర్మాసనం
- సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీల రిజర్వేషన్ల భవితవ్యం ఆధారపడి ఉన్న నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం ఏ తీర్పు ఇస్తుందోనని అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్న వారు సుప్రీంకోర్టు తీర్పుపై ఆశగా ఎదురుచూస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తి వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎల్‌పీ వేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ శాస్త్రీయంగా, చట్టబద్ధంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే జరిగిందని పిటీషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రిజర్వేషన్లపై రాజ్యాంగంలో 50 శాతం పరిమితి లేదని, ఇది సుప్రీంకోర్టు కేవలం విధించిన మార్గదర్శక సూత్రం మాత్రమే అని పేర్కొంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
‘బీసీ రిజర్వేషన్లపై శాస్త్రీయంగా కుల సర్వే జరిగింది. బీసీల జనాభా తెలంగాణలో 56 శాతానికి పైగా ఉంది. డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఎంపరీకల్ డాటా సేకరించాం. శాస్త్రీయ అధ్యయనం తర్వాతే చట్ట నిబంధనలకు లోబడి 42% రిజర్వేషన్లు కల్పించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది’ అని పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ పిటిషన్ తాజాగా న్యాయస్థానం రిజిస్ట్రీలో లిస్ట్ కావడంతో గురువారం విచారణకు రానున్నది. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లనుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!