Site icon NTV Telugu

TS Assembly: హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ.. ఉత్తమ్ వర్సెస్ హరీశ్ రావు మాటల యుద్ధం..

Harish Rao

Harish Rao

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ఇచ్చింది. దీనిపై దీర్ఘకాలిక చర్చలో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.

Read Also: Delhi : ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కుప్పకూలిన పాండల్

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మేము మాట్లాడుతుంటే ఇంకో సభ్యులకు అనుమతి ఇవ్వకండి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యదూరమైన విషయాలు బుక్ లో పొందుపరిచారు అని పేర్కొన్నారు. ఆయకట్టు రెండు చోట్ల రెండు రకాలగా చెప్పారు.. వాస్తవం మాత్రం ఇంకోలా ఉందన్నారు. ఇక, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2014కి ముందు అంటే నిజాంకి ముందు ఆ తర్వాత అని చెప్పుకొచ్చారు.

Read Also: Minister Kakani Govardhan Reddy: ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఎన్నికల్లో చూసుకుందాం..!

ఇక, నిజాం అప్పటి నుంచి నిధులు ఖర్చు పెట్టారా?.. రాయలసీమ లిఫ్ట్ గురించి అబద్ధాలు రాశారు అంటూ హరీశ్ రావు అన్నారు.. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇస్తూ.. హరీష్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అని పేర్కొన్నారు. కేసీఆర్, జగన్ అనేక సందర్భాల్లో నీటి వాటాపై చర్చ చేశారు.. కేంద్రం నుండి లేఖ వచ్చింది అపెక్స్ లో పాల్గొనండి అని అన్నారు. అప్పుడు అభ్యంతరం చెప్తే రాయలసీమ ప్రాజెక్టు ఆగేది.. మీటింగ్ కి పోకుండా టెండర్ అయిపోయే వరకూ చుశారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Read Also: Drugs Case: గోవా జైల్ నుంచి డ్రగ్స్‌ దందా.. రూ.8 కోట్ల మత్తుపదార్థాల కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు రీకౌంటర్ ఇచ్చారు.. వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్ ఇది అంటూ విమర్శించారు. ఎన్నికల్లో గోబెల్స్ ప్రచారం చేశారు.. సభలో కూడా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులు అప్పగిస్తామని మినిట్స్ మీటింగ్ లో ఉంది.. ఫిబ్రవరి 1వ తేదీ జరిగిన మీటింగ్ లో కూడా ఒప్పుకున్నారు.. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి చెప్పారు అని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

Read Also: Kiara Advani: తల్లి కాబోతున్న కియారా అద్వానీ..పిక్స్ వైరల్…

హరీశ్ రావు వ్యాఖ్యలకు ఉత్తమ్ కుమార్ స్పందిస్తూ.. మేము ఆ మినిట్స్ మీటింగ్ కు మేము ఒప్పుకోలేదన్నారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించము అని చెప్పినం అన్నారు. అంటే, 299 టీఎంసీలకే ఒప్పుకోండి అంటారా హరీశ్ రావు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించాలని మేము చెప్పలేదు.. దానికి మేము వ్యతిరేకం.. మీ ప్రభుత్వంలో సెక్రెటరీ స్మితా సబర్వాల్ లేఖ రాశారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు.

Read Also: Uttam Kumar Reddy: ప్రాజెక్టులపై అసెంబ్లీలో శ్వేతపత్రం.. కాగ్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు

అసెంబ్లీలో ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కార్ పై అసత్య ఆరోపణలు చేస్తుందని హరీశ్ రావు ఆరోపించారు. దీనికి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావుకి సవాల్ విసిరారు. కృష్ణాజలాలు అన్ని సక్రమంగా చేశా అంటున్నారు.. స్మితా సబర్వాల్ లేఖ సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. దీనికి హరీశ్ రావు స్పందిస్తూ.. మంత్రులు మీరు సమాధానం ఇవ్వకుండా నన్ను అడుగుతున్నారు ఏంటి అని అడిగారు.

Exit mobile version