Budget Session: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ సెషన్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంగా జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సెషన్స్ మరింత ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరయ్యే ఛాన్స్ ఉంది. దీంతో అందరి దృష్టి తెలంగాణ అసెంబ్లీ చర్చపైనే పడింది. అందులోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా విమర్శలు గుప్పిస్తునే దూకుడుగానే ముందుకు కొనసాగుతుంది. బీఆర్ఎస్ పై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. ప్రతిపక్ష నేతల కౌంటర్లకు అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
Read Also: Astrology: ఫిబ్రవరి 8, గురువారం దినఫలాలు
అయితే, తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెడుతుంది. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగనుంది. ఇక, బీఏసీ సమావేశం నిర్వహించి సభను ఎన్ని రోజులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయిస్తారు. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం (ఫిబ్రవరి 10న) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం బడ్జెట్‌పై చర్చ జరగనుంది. బడ్జెట్ సమావేశాలు వారం నుంచి 10రోజులు జరిగే ఛాన్స్ ఉంది.
Read Also: 8th Pay Commission: ఉద్యోగులకు ప్రభుత్వం షాక్… ఇప్పట్లో 8వ వేతన సంఘం లాంటివేం లేవు
ఇక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తుంది. మిగతా వాటికి 100 రోజుల గడువులోపు అమలు చేస్తామని వెల్లడించారు. తాజాగా మరో రెండు పథకాల అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగతా పథకాలు తక్షణ అమలు కోసం ప్రతిపక్షం పట్టుబడుతుంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే.. ఎలక్షన్ కోడ్ సాకుగా చూపి కాంగ్రెస్ తప్పించుకునేందుకు చూస్తుందని ఆరోపిస్తున్నారు. గ్యారెంటీలు, వాటి అమలుపై కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం, కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్, కాగ్, ధరణిపై నివేదికలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. కేఆర్ఎంబీ వ్యవహారం కూడా ఇటీవల రాజకీయ వివాదానికి దారి తీసింది.
