Site icon NTV Telugu

KTR : గవర్నర్‌ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే.. 20 శాతం కమీషన్‌ తప్ప.. విజన్‌ లేని ప్రభుత్వం ఇది

Ktr

Ktr

KTR : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే, గవర్నర్‌ ప్రసంగం తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగం పూర్తిగా ప్రాథమికంగా రాసిన ఒక ప్రెస్‌నోట్‌లా అనిపించిందని వ్యాఖ్యానించారు. ఆయన గవర్నర్ ప్రసంగాన్ని గాంధీభవన్ ప్రెస్‌మీట్ లా ఉందని ఎద్దేవా చేశారు. గత 15 నెలల కాలంలో ప్రభుత్వ పాలన పూర్తిగా విఫలమైందని, అసెంబ్లీ సమావేశాల్లో సుతారంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Governor Jishnu Dev Varma : మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉంది

రేవంత్‌ రెడ్డి చేతకానితనం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి.. కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని కేటీఆర్‌ అన్నారు. రుణమాఫీ కేవలం 30% మాత్రమే జరిగింది, మిగిలిన రైతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. “20% కమీషన్ తప్ప, ఈ ప్రభుత్వానికి ఎటువంటి విజన్ లేదు”, అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై కోపంతో మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పుల చేస్తే.. రేవంత్ సర్కార్ ఒక్క ఏడాదిలోనే రూ.లక్ష 13 వేల కోట్ల అప్పు చేసిందని అన్నారు. రేవంత్ రెడ్డి వల్లే వరి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌వన్ అయిందంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం బాధాకరమని కేటీఆర్ మండిపడ్డారు.
Health Tips: వేసవిలో పిల్లలకు ఈ 4 ప్రత్యేక జ్యూస్‌లను ఇవ్వండి..

Exit mobile version