హాట్ హాట్‌గా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈనెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా వేశారు. మళ్లీ రెండవ రోజు (సోమవారం) ప్రారంభమైన అసెంబ్లీ.. ఈరోజుతో 7 రోజులు సమావేశాలు వాడీవేడిగా సాగాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు కీలక చర్చలపై చర్చ జరిగింది. అంతేకాకుండా పలు బిల్లులకు ఆమోదం లభించింది. ఏడు రోజులు అసెంబ్లీ సమావేశాలు కొనసాగగా.. పని గంటలు 37 గంటల 44 నిమిషాలు నడిచాయి. సభలో 39 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సభ రసవత్తరంగా సాగింది. అనంతరం సభ నిరవధిక వాయిదా పడింది.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..
- తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
- 7 రోజులు కొనసాగిన సమావేశాలు
- పని గంటలు 37 గంటల 44 నిమిషాలు.
Show comments