Tejas Crash Dubai: దుబాయ్ ఎయిర్‌షోలో కూలిన తేజస్ యుద్ధ విమానం.. భారత్ పైలట్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejas Crash Dubai: దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఎయిర్‌షోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఎయిర్‌షోలో విన్యాసాలు చేస్తుండగా భారత్‌కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కూలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన ఎక్స్ వేదికగా వెల్లడించింది.
READ ALSO: Sania Mirza: టెన్నిస్ రాకెట్ పట్టని వారు కూడా మాట్లాడేవారు.. ఒక్కోసారి జాలి కలిగేది!
Also Read
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
ప్రమాదానికి గురైన తేజస్ యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసింది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 4.5వ తరం ఫైటర్‌జెట్. ప్రస్తుతం భారత వాయుసేనలో ఎంకే1 తేజస్ జెట్‌లు సేవలు అందిస్తున్నాయి. ఈ యుద్ధ విమానాలు ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో తేజస్ ఫైటర్ జెట్ శిక్షణ సార్టీలో ఉండగా.. కూలిపోయింది. ఆ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదంపై స్పందించిన భారత వాయుసేన..
‘‘దుబాయ్ ఎయిర్‌షోలో తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందడం దిగ్భ్రాంతికరం. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ కష్టసమయంలో పైలట్ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతాం’’ అని వాయుసేన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో యుద్ధ విమానం ఒక్కసారిగా కూలి మంటలు చెలరేగిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.
దుబాయ్ ఎయిర్‌షో ప్రపంచంలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు ఈ ఎయిర్‌షోలో పాల్గొని సందడి చేస్తాయి. ఇందులో భాగంగా పాల్గొన్న తేజస్ యుద్ధ విమానం పైలట్ నెగెటివ్ జీ-ఫోర్స్ టర్న్ నుంచి యుద్ధవిమానాన్ని వెనక్కి మళ్లించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
READ ALSO: Gujarat BLO Suicide: ‘నేను ఇకపై ఈ పని చేయలేను’.. ఆత్మహత్య చేసుకున్న మరో BLO
An IAF Tejas aircraft met with an accident during an aerial display at Dubai Air Show, today. The pilot sustained fatal injuries in the accident.
IAF deeply regrets the loss of life and stands firmly with the bereaved family in this time of grief.
A court of inquiry is being…
— Indian Air Force (@IAF_MCC) November 21, 2025
తాజావార్తలు
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!