NTV Telugu Site icon

Uttar Pradesh: సెల్ ఫోన్ లో పోర్న్ వీడియో చూసి.. చెల్లెల్ని రేప్ చేసి హ‌త్య

Up

Up

Kasaganj: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల కుర్రాడు త‌న మైన‌ర్ సోద‌రిని రేప్ చేసి హ‌త్య చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క‌స్‌గంజ్‌లో ఈ దారుణ ఘ‌ట‌న జరిగింది. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజూ అనే వ్యక్తి తన సెల్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూసిన త‌ర్వాత త‌న సోద‌రిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటన ఫిబ్రవరి 3వ తేదీన రాత్రి చోటు చేసుకుంది. అత్యాచారం చేసిన విషయం ఇంట్లో చెబుతుంద‌న్న భ‌యంతో సోద‌ర్ని అత‌డు హతమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: Communist Letter: ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ మోస్ట్ పేరుతో లేఖ కలకలం..

ఫిబ్రవరి 4వ‌ తేదీన తన మేనల్లుడి గురించి మామ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు అని పటియాలీ ఎస్ఐ గోవింద్ బల్లట్ తెలిపారు. నిందితుడిని సోమ‌వారం సాయంత్రం అత‌న్ని అదుపులోకి తీసుకున్నాట్లు చెప్పుకొచ్చారు. నిందితుడు సంజూ తండ్రి ఏడాది క్రిత‌మే మ‌ర‌ణించాగా.. త‌ల్లి, సోద‌రితో క‌లిసి అత‌ను ఉంటున్నాడు.. అయితే, అఘాయిత్యం జ‌రిగిన రోజున త‌ల్లి బంధువ‌ల ఇంటికి వెళ్లింది.. ఇంట్లో ఒంట‌రిగా ఉన్న ఆ కుర్రాడు త‌న మొబైల్‌లో పోర్న్ వీడియోస్ చూసిన తర్వాత త‌న చెల్లెల్ని రేప్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి దగ్గర నుంచి మొబైల్ ఫోన్ రిక‌వ‌ర్ చేసుకుని జైలుకు పంపారు.