IND vs NED: ఫైనల్ టచ్ ఇచ్చిన భారత్.. నెదర్లాండ్స్ పై టీమిండియా ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా ఈ వరల్డ్ కప్ లో విజయాల పరంపర కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఆడిన లీగ్ మ్యాచ్ ల్లో అన్నింటిలోనూ గెలిచింది. ఈరోజు జరిగిన టోర్నీ చివరి లీగ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను 160 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లోనూ భారత్ ఫైనల్ టచ్ ఇచ్చి.. విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో హైలెట్ ఏంటంటే.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ బౌలింగ్ వేసి తలో వికెట్ తీశారు. ఫ్యాన్స్ వీరిద్దరు బౌలింగ్ చేయాలన్న కోరిక మేరకు.. బౌలింగ్ చేశారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో బ్యాటర్ కేఎల్ రాహుల్ 102 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ బ్యాట్‌ల నుంచి హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.
Read Also: CM KCR: రెండో విడత ప్రచారానికి సిద్ధమైన గులాబీ బాస్.. రేపటి నుంచి షురూ
Also Read
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
411 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. ఆరంభంలోనే సిరాజ్ దెబ్బ తీశాడు. వెస్లీ బరేసీ (04)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మాక్స్ ఓడౌడ్ 30, కోలిన్ అకెర్‌మాన్ 35, అకర్‌మన్ 35, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 45, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 17, డీలీడ్ 12, తేజ నిడమనూరు 54, వాన్ బీక్ 16, వాన్ డర్ మెర్వ్ 16 పరుగులు చేశారు. ఇక.. భారత్ బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీశారు. వీరితో పాటు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.
Read Also: Business News: ఇన్వెస్టర్లపై కాసుల వర్షం.. ఒక్క సెకనులో రూ.3 లక్షల కోట్ల లాభం
తాజావార్తలు
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!