NTV Telugu Site icon

Asian Games 2023: క్రికెట్‌లో పసిడి సాధించిన టీమిండియా.. మ్యాచ్ ఆడకుండానే గెలుపు

Asia Cricket

Asia Cricket

ఆసియా క్రీడల్లో మెన్స్ టీమిండియా స్వర్ణం సాధించింది. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ పూర్తి కాలేదు. దీంతో ఎక్కువ ర్యాంకింగ్‌ కారణంగా భారత్‌ను విజేతగా ప్రకటించారు. ఈ క్రమంలో భారత జట్టు ఖాతాలో మరో స్వర్ణం చేరింది. హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌ 18.2 ఓవర్లలో 5 వికెట్లకు 112 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ కొనసాగలేదు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌కు ఆరంభం ఏమాత్రం బాగోలేదు. రెండో ఓవర్‌లో 5 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జుబైద్ అక్బరీ 5 పరుగుల వద్ద ఔటయ్యాడు.

Read Also: ICC World cup 2023: ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ గెలుపు.. మెరిసిన షకీబ్, హసన్

ఆ తర్వాత మూడో ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయాయి. మహ్మద్ షాజాద్ (4), అలీ జద్రాన్(1) పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. అనంతరం కొంత సేపటి వరకు వికెట్లను కాపాడుకున్న ఆఫ్ఘనిస్తాన్.. 10వ ఓవర్ నాలుగో బంతికి అఫ్సర్ జజాయ్ (15) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 11వ ఓవర్ చివరి బంతికి కరీం జనత్ (1) రూపంలో ఆ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత షాహిదుల్లా కమల్, కెప్టెన్ గుల్బాదిన్ నైబ్ మధ్య ఆరో వికెట్‌కు మంచి భాగస్వామ్యం నెలకొల్పగా.., వర్షం కురవడంతో మ్యాచ్‌ నిలిచిపోయింది. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 60 పరుగులు చేశారు. షాహిదుల్లా కమల్ 49 నాటౌట్ , కెప్టెన్ 27 నాటౌట్ గా ఉన్నారు. ఇక భారత్ బౌలింగ్ విషయానికొస్తే.. మంచి ప్రదర్శన కనబర్చారు. అర్ష్‌దీప్‌ సింగ్‌, షాబాజ్‌ అహ్మద్‌, రవి బిష్ణోయ్‌, శివమ్‌ దూబే తలో వికెట్‌ తీశారు.