Team India loss: ఆదివారం భారత క్రికెట్ అభిమానులకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. పురుషుల, మహిళల క్రికెట్ జట్లు రెండూ కీలకమైన మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యాయి. ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా పురుషుల జట్టు తొలి వన్డేలో పరాజయం చెందగా, మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియా పర్యటనను టీమ్ఇండియా పేలవంగా ఆరంభించింది. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బౌన్సీ పిచ్‌పై భారత బ్యాటర్లు తడబడటంతో ఈ ఓటమి తప్పలేదు.
AA22 x A6 : అట్లీ, అల్లు అర్జున్‌ల మాయలో పడిపోయిన రణ్వీర్ సింగ్!
వర్షం కారణంగా మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ లో రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) కాస్త రాణించారు. అయితే ఎన్నో అసలు పెట్టుకున్న రోహిత్ శర్మ (8), కోహ్లి (0) లు మాత్రం తుస్సుమనిపించారు. ఇకపోతే కోహ్లికి ఆస్ట్రేలియాలో ఇది తొలి వన్డే డక్ అవుట్. ఇక ఆసీస్ బౌలర్ల విషయానికి వస్తే.. హేజిల్‌వుడ్ (2/20), ఒవెన్ (2/20), కునెమన్ (2/26)తో రాణించారు. ఇకపోతే డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఆసీస్ లక్ష్యాన్ని 131 పరుగులకు సవరించారు. దీనిని ఆస్ట్రేలియా 21.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటింగ్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్), జోష్ ఫిలిప్ (37)తో విజయం వైపు దూసుకెళ్లారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో వన్డే గురువారం జరుగనుంది.
Astrology: అక్టోబర్ 20, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
ఐకమరోవైపు మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఇంగ్లండ్ మహిళల జట్టు చేతిలో 4 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా ఓడిపోయింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్‌నైట్ (109) సెంచరీ సాధించింది. ఇక భారత బౌలర్లు దీప్తిశర్మ (4/51), శ్రీచరణి (2 వికెట్లు) సాధించారు. ఇక లక్ష్యఛేదనలో భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి ఓడింది. గెలుపుదాకా వచ్చి ఆఖరికొచ్చేసరికి చేతులెత్తేసింది. ఈ ఇన్నింగ్స్ లో స్మృతి మంధానా (88), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70), దీప్తిశర్మ (50) అర్ధశతకాలు సాధించినా విజయం దక్కలేదు. 234 పరుగుల స్కోరు వద్ద స్మృతి మంధానా ఔటవడం మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. మెరుగైన ప్రదర్శన చేసినా, విజయానికి చేరువైనా ఆఖరిలో పట్టు కోల్పోవడం భారత మహిళల జట్టుకు పరాజయాన్ని మిగిల్చింది.