Rohit Sharma: ఆసియా కప్‌కి ముందు.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Visits Tirupathi Balaji Temple ahead of Asia Cup 2023: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం రోహిత్ తన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రోహిత్ సతీమణి రితిక సజ్దే, కూతురు సమైరా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు భారత కెప్టెన్‌కు స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
రోహిత్ శర్మ, రితిక సజ్దే తిరుమల ఆలయంలో నడుచుకుంటూ వస్తున్న వీడియోలు, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోహిత్‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. అయితే భారీ సెక్యూరిటీ ఉండడంతో వారికి నిరాశ తప్పలేదు. మీడియాకు మాత్రం రోహిత్ దంపతులు ఫోజులిచ్చారు.
Also Read
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
ఆగష్టు చివరలో ఆసియా కప్ 2023 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమలకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రోహిత్ ఇటీవలే వెస్టిండీస్ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. టెస్ట్, వన్డేలు ఆడిన రోహిత్.. టీ20 సిరీస్ నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. 5 టీ20 సిరీస్‌లోని చివరిదైన మ్యాచ్ నేడు రాత్రి ఫ్లోరిడాలోని లాడర్‌హిల్స్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
Rohit Sharma & his family at Tirupathi Balaji Temple ahead of Asia Cup.
– Beautiful pictures. pic.twitter.com/5NcZuN8xhh
— Johns. (@CricCrazyJohns) August 13, 2023
Rohit Sharma & his family visited Tirupathi Balaji Temple.pic.twitter.com/2HRFACIzdJ
— Johns. (@CricCrazyJohns) August 13, 2023
తాజావార్తలు
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!