Team India Schedule 2025: వచ్చే ఏడాది టీమిండియా షెడ్యూల్ ఇలా..
- వచ్చే ఏడాది టీమిండియా షెడ్యూల్
- 2025 బిజిగా గడపనున్న టీమిండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Schedule 2025: భారత క్రికెట్ జట్టు 2024లో అభిమానులను ఎంతగానో థ్రిల్ చేసింది. ఈ ఏడాది టీమిండియాకు కాస్త మిశ్రమ సంవత్సరం అని చెప్పవచ్చు. ఒకవైపు భారత్ 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. మరోవైపు, తొలిసారిగా స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇకపోతే, 2025లో కూడా టీమిండియా చాలా బిజీగా ఉండబోతోంది. 2025 చాలా ప్రత్యేకం కానుంది. ఎందుకంటే. 2025 సంవత్సరంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు మొత్తం 2 ICC ట్రోఫీలను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు మ్యాచ్‌తో భారత జట్టు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం చివరి మ్యాచ్ జనవరి 3 నుండి 7 మధ్య సిడ్నీలో జరుగుతుంది. దీని తర్వాత, వైట్ బాల్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత 12 ఏళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని గెలవాలనే ఉద్దేశంతో ఐసీసీ హైబ్రిడ్ మోడల్లో దుబాయ్‌లో ఆడనుంది. ఇక 2025 లో టీమిండియా షెడ్యూల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
Also Read: The KING is dead: ది కింగ్ ఈజ్ డెడ్.. కోహ్లీపై ఆర్సీబీ మాజీ కోచ్ విమర్శలు..
Also Read
- Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్‌గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
- IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
- Trump-Meloni: ‘ఆమె అంటే ఇష్టం.. కానీ తప్పు చేసింది’.. టర్కీ టూర్లో మెలోనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Indonesia: ‘నా డీఎన్ఏలో భారతీయ రక్తం ఉంది’.. ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు
జనవరి-ఫిబ్రవరి: ఇంగ్లండ్ భారత పర్యటన (జనవరి 22 నుండి ఫిబ్రవరి 12 వరకు)
భారత్ vs ఇంగ్లండ్ T20I సిరీస్ (5 T20Iలు) యొక్క పూర్తి షెడ్యూల్ ఇలా..
1వ టి20: 22 జనవరి 2025, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా.
2వ టి20:: 25 జనవరి 2025, MA చిదంబరం స్టేడియం, చెన్నై.
3వ టి20: 28 జనవరి 2025, రాజకోట్
3వ టి20: 31 జనవరి 2025, పూణె.
5వ టి20: 2 ఫిబ్రవరి 2025, వాంఖడే స్టేడియం, ముంబై.
భారత్ vs ఇంగ్లండ్ ODI సిరీస్ (3 ODIలు) పూర్తి షెడ్యూల్..
1వ ODI : 6 ఫిబ్రవరి 2025, విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్
2వ ODI: 9 ఫిబ్రవరి 2025, బారాబతి స్టేడియం, కటక్
3వ ODI: 12 జనవరి 2025, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
ఫిబ్రవరి–మార్చి: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (19 ఫిబ్రవరి – 9 మార్చి 2025)
20 ఫిబ్రవరి – ఇండియా vs బంగ్లాదేశ్ – దుబాయ్
23 ఫిబ్రవరి – ఇండియా vs పాకిస్థాన్ – దుబాయ్
2 మార్చి – ఇండియా vs న్యూజిలాండ్ – దుబాయ్
మార్చి 4 – ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ – దుబాయ్ (క్వాలిఫై అయితే)
మార్చి 9 – ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ – దుబాయ్ (అర్హత సాధిస్తే)
మార్చి-మే: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 (14 మార్చి – 25 మే 2025).
జూన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్: 11-15 జూన్ 2025 – లండన్ (అర్హత సాధిస్తే).
Also Read: Puspa 2 Collections: తగ్గేదేలే.. కొనసాగుతున్న పుష్ప కలెక్షన్ల రికార్డుల పరంపర..
జూన్-ఆగస్టు: ఇంగ్లండ్‌లో భారత పర్యటన (జూన్ 20-ఆగస్టు 4)..
తొలి టెస్టు: జూన్ 20-24, హెడింగ్లీ, లీడ్స్
రెండో టెస్టు: జూలై 2-6, ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
మూడో టెస్టు: జూలై 10-14, లార్డ్స్, లండన్
నాలుగో టెస్టు : 23-27 జూలై, మాంచెస్టర్
ఐదవ టెస్ట్: 31 జూలై-4 ఆగస్టు, ది ఓవల్.
ఇప్పటి వరకు ఈ మ్యాచ్ ల వివరాలను వెల్లడించారు. ఇవే కాకుండా.. షెడ్యూల్ ప్రకారం, టీమిండియా 2025 లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో కూడా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. కాకపోతే ఆ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల అవ్వలేదు.
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్‌గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!