Penugonda Farmers: తుఫాన్ల దెబ్బకు తోడు ముంపు కష్టాలు.. పెనుగొండలో రోడ్డెక్కిన రైతులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో రైతులు ఆందోళనకు దిగారు. డంపింగ్ యార్డ్ కారణంగా పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. పెనుగొండ ప్యాలెస్ రోడ్ సెంటర్లో నిరసన చేపట్టడంతో.. పెనుగొండ–నిడదవోలు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. డంపింగ్ యార్డ్ వల్లే తమ పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నక్కల కాలువలో చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని ఆరోపించారు. కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో ముంపునీరు పొలాల్లోకి చేరిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని.. తాజాగా ముంపు కారణంగా మరింత నష్టం వాటిల్లిందని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. పంటలు పూర్తిగా దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెనుగొండ డంపింగ్ యార్డ్‌ను తక్షణమే తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. నక్కల కాలువలో పేరుకుపోయిన చెత్తను యుద్ధ ప్రాతిపదికన తొలగించి.. నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను కోరారు. ఆందోళన విరమించి రహదారిపై నుంచి వెళ్లిపోవాలని పోలీసులు రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Also Read
- Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
- Ramayana Box Office: 'ఆదిపురుష్' రికార్డు అవుట్.. భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణం’..
- Airtel నుంచి 'Buy 1 Get 1' ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
- Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
తాజావార్తలు
-
Penugonda Farmers: తుఫాన్ల దెబ్బకు తోడు ముంపు కష్టాలు.. పెనుగొండలో రోడ్డెక్కిన రైతులు!
-
Ramayana Record: ‘రామాయణ’ రికార్డుల జాతర.. ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ను దాటేసి టాప్‌లోకి!
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Ramayana Box Office: ‘ఆదిపురుష్’ రికార్డు అవుట్.. భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణం’..
-
Naga Chaitanya: నాగ చైతన్య ముందు పెద్ద టార్గెట్టే.. 300 కోట్లను దుల్లగొడితేనే..!
ట్రెండింగ్
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..