Good News For Teachers : తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. జనవరి 27 నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనవరి 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ పూర్తవుతుంది. మార్చి 4 నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయనున్నారు. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లోపు అప్పీళ్లను పరిష్కరించనున్నట్లు విద్యాశాఖ తాజా షెడ్యూల్‌లో పేర్కొంది. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల బదిలీలు, పదోన్నతులకు అనుమతి ఇచ్చిన రోజుల వ్యవధిలోనే వేగంగా ప్రక్రియ చేపట్టడం విశేషం. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల నిరీక్షణకు తెరదించినట్లైంది.
Read Also: Real Mafia: ఆదిలాబాద్ జిల్లా భూములపై అక్రమార్కుల కన్ను.. జోరుగా రియల్ దందా
తెలంగాణ టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్ రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లకు ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతులు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,266 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందనున్నారు.
Read Also: Republic Day: గణతంత్ర వేడుకలపై వీడని సస్పెన్స్.. ఈ ఏడాది అక్కడేనా..?
ఉద్యోగులకు 2.73 శాతం డీఏ పెంపు..
దీనితోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి పింఛన్‌తో కలిపి ఫిబ్రవరిలో పింఛన్‌దారులకు డీఏ చెల్లించనుంది. 2021 జులై నుంచి 2022 డిసెంబర్ నెలాఖరు వరకు 8 విడతల్లో డీఏ బకాయిలను జీపీఎఫ్‌లో జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.