విద్యాబద్దులు నేర్పాల్పిన ఉన్నత స్థానం ఉన్న టీచర్.. విద్యార్థులను అవహేళన మాట్లడుతూ.. వారిని వేధింపులకు గురి చేసింది. ఓ విద్యార్థిని నీకు ఇద్దరు తండ్రులు అంటూ హేళన చేసింది. అంతేకాకుండా.. అలా మాట్లాడేందుకు వచ్చిన సదరు విద్యార్థి తండ్రి ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళితే.. అల్వాల్ లో నివాసం ఉంటున్న రవిశంకర్ (45) తన ఇద్దరు పిల్లలు నేరెడ్‌మెట్ భవన్స్ స్కూల్‌లో చదువుకుంటున్నారు. అయితే.. రవిశంకర్ ఇద్దరు పిల్లల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న యువరాజ్ స్కూల్ కి పాకెట్ మనీగా 400 రూపాయలు తీసుకెళ్లాడు.
Also Read : AP BJP: చంద్రబాబుకు బీజేపీ కౌంటర్.. వరుస ట్వీట్లతో విమర్శల వర్షం
అయితే.. టీచర్ సునీత నాయర్ ఆ డబ్బు చూసి ఎక్కడ దొంగతనం చేశావని నిలదీయడంతో… స్టూడెంట్ వర్సెస్ టీచర్స్ మాటా మాట పెరిగింది. ఇదే సమయంలో సదరు టీచర్.. ( DO YOU HAVE TWO FATHERS ) నీకు ఇద్దరు తండ్రులు ఉన్నారా.. అని స్టూడెంట్‌ని హేళన చేసింది. దీంతో.. స్టూడెంట్ తన నాన్న రవిశంకర్‌ను పిలిచి మాట్లాడించే క్రమంలో టీచర్లంతా ఒక్కసారిగా స్టూడెంట్ తండ్రి రవిశంకర్‌పై విరుచుకుపడ్డారు. దీంతో అక్కడికక్కడే గుండెపోటుతో కుప్పకూలిన యువరాజ్ తండ్రి రవిశంకర్ మృతి చెందారు. రవి శంకర్ మృతికి టీచర్ సునీత నాయర్ కారణమని రవిశంకర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.