Teacher Fired : అయ్యో ఆ ఒక్క మాటతో టీచర్ ఉద్యోగం పోయింది.. మంచి చెప్పినా తప్పేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teacher Fired For Political Comments : టీచర్ లు మనకు చదువు చెప్పడంతో పాటు మంచి చెడు కూడా చెబుతారు. అయితే ఈ విధంగానే ఎన్నికల్లో చదువుకున్న అభ్యర్థులకే ఓటు వేయాలని చెప్పిన ఓ టీచర్ ఉద్యోగం పోయింది. అతడిని ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది.
అన్ ఎకాడమీ.. ఆన్ లైన్ లో సివిల్ సర్వీసెస్ తో పాటు రకరకాల గవర్నమెంట్ పోటీ పరీక్షలకు కోర్సులు నిర్వహిస్తూ ఉంటుంది. పోటీ పరీక్షలకు తయారయ్యే ప్రతి విద్యార్థికి తెలిసిన ప్లాట్ ఫామ్ ఇది. దీనిలో కరణ్ సంగ్వాన్ టీచర్ గా పనిచేస్తున్నారు. అయితే కరణ్ తన విద్యార్థులకు పాఠం చెప్పే సందర్భంగా చదువుకున్న వారికే ఓటేయాలని అన్నారు. వారు మాత్రమే ప్రస్తుత ఆధునాతన పరిస్థితులను అర్థం చేసుకోగలరని, చదువుకోని వారికి ఏఐ లాంటి వాటి గురించి ఏం అర్థం కాదని అర్థం వచ్చేట్టట్లు మాట్లాడారు. అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో అన్ ఎకాడమీ కరణ్ ను ఉద్యోగం నుంచి తొలగించింది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆ ఉపాధ్యాయుడు చెప్పిన దాంట్లో తప్పులేదని అతనికి మద్దతుగా నిలిచారు. చదువుకున్న వారికి ఓటు వేయమని చెప్పడంలో తప్పేముందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ యుగమని నిరక్షరాస్యులైన ప్రజా ప్రతినిధులు 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశాన్ని ఎన్నటికీ నిర్మించలేరని అరవింద్ కేజ్రీవాల్ సైతం పేర్కొన్నారు. చాలా మంది ఈ విషయంలో అన్ అకాడమీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read
ఇక దీనిపై అనాకాడెమీ సహ వ్యవస్థాపకుడు రోమన్ సైనీ స్పందిస్తూ కరణ్ సంగ్వాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను అందించడానికి కట్టుబడి ఉన్న విద్యా వేదిక అన్ ఎకాడమీ అని పేర్కొన్నారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు నిష్పాక్షికమైన జ్ఞానాన్ని పొందేలా చేయడం కోసం తమ ఉపాధ్యాయులందరికీ కఠినమైన ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తున్నామని చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైన స్థలం కాదన్నారు. అవి విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కరణ్ తన వ్యక్తిగత అభిప్రాయాలను విద్యార్థులతో చెప్పి ప్రవర్తనా నియమావళిని అతిక్రమించారని అందుకే ఆయనను తొలగించాల్సి వచ్చిందని ట్వీట్ చేశారు.
This teacher urged his students to vote for an educated leader, he didn’t take anyone’s name.
BJP supporters assumed that he was targeting Modi and they made pressure on the Unacademy.
Now he has lost his job. pic.twitter.com/f7olZ3Rr7d
— Shantanu (@shaandelhite) August 17, 2023
తాజావార్తలు
-
Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
-
Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
-
El Nino Impact : ఎల్నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
-
UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
-
Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?