CM Chandrababu: రేపు టీడీపీ కీలక సమావేశం.. ఇంటింటి ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం..
- రేపు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం...
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం..
- హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆదివారం రోజు కీలక సమావేశానికి సిద్ధమయ్యారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేపు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ విస్తృతస్థాయి సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరుకానున్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జులై 2వ తేదీ నుండి కూటమి పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. సుమారు నెల రోజుల పాటు కూటమి పార్టీ నేతల ప్రచారం కొనసాగనుంది.. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా దీని ద్వారా ప్రచారం చేయనున్నారు.. అయితే, ఈ కార్యక్రమం ఎలా ఉండాలి..? ప్రజలకు ఎలాంటి విషాలు వెల్లడించాలి.. కూటమి ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు ఏంటి..? చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి.. తదితర అంశాలపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్..
Read Also: Samantha : అలా చేసే దమ్ముందా.. చెత్త కామెంట్స్ చేయకండి
Also Read
- Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
- ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
కాగా, చేసింది చెప్పడం. చేయవలసింది వివరించడం. ఇదే కాన్సెప్ట్‌తో జనం బాట పడుతోంది టీడీపీ. టీడీపీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్ళడానికి కార్యాచరణ రెడీ చేసుకుటున్నారు. ఏడాది పాలన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లడానికి ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. జులై మొదటివారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధినేత చంద్రబాబు… నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో కూడా ఇంటింటికీ నేతలు వెళ్లే కార్యక్రమంపై ప్రధానంగా చర్చ జరగనుంది. జనం అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలో ముందుగానే డిసైడ్ చేసుకుంటే మంచిదనే ఆలోచనలో ఉన్నారట నేతలు.. ఏడాది పాలనలోనే అన్ని జరిగిపోయాయని చెప్పడం లేదని మొన్న కూటమి సమావేశంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అయితే… చేసిన మంచిని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ఇదే ఇప్పుడు జనంలోకి వెళ్లి చెప్పనున్నారు ఎమ్మెల్యేలు. ఈ ఏడాది కాలంలో ఏ ఏ పథకాలు అమలు జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతున్న తీరు, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు. ఇలా ప్రతి అంశాన్ని జనానికి క్షుణ్ణంగా వివరించాలని, అవసరమైతే అన్ని వివరాలతో కూడా పాంప్లెంట్స్ కూడా ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చించనున్నారని సమాచారం..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్‌కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!