NTV Telugu Site icon

AP Assembly: అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Tdp

Tdp

AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఇవాళ కూడా నిన్నటి సీన్‌ రిపీట్ అయింది. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెడ్ లైన్ దాటి స్పీకర్ పోడియం వద్దకు టీడీపీ సభ్యులు వెళ్లారు. వాయిదా తీర్మానంపై పట్టుబట్టారు టీడీపీ సభ్యులు. స్పీకర్‌పై కాగితాలు చించి విసిరారు. ప్రాజెక్టులు, రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు చర్చకుపట్టుబట్టింది. రైతులను, పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

Read Also: AP Budget LIVE UPDATES: ఏపీ బడ్జెట్‌ సమావేశాలు.. లైవ్ అప్‌డేట్స్

మూడోరోజు సమావేశాలు ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభ నుంచి ఒకరోజు పాటు స్పీకర్ వారిని సప్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినా సభ్యులు సభలోనే కొనసాగుతూ నినాదాలు చేస్తుండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే సభలో పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ ఆఫీసులోకి చొచ్చుకు వెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయగా.. మార్షల్స్ అడ్డుకున్నారు. స్పీకర్ ఆఫీస్ ముందుసస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

Show comments