మద్యం స్కాంలో త్వరలోనే జగన్ అరెస్ట్ అవుతారని టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగన్ పాత్రపై కూడా విచారణ జరపాలన్నారు. మిథున్ రెడ్డి అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. 3,500 కోట్ల రూపాయల మద్యం స్కామ్‌లో విజయ సాయి రెడ్డి వాటాలు తేలక బయటపడ్డారని ఆరోపించారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఈ స్కామ్‌లో ముఖ్య భూమిక వహించారని ఆరోపించారు. క్యాబినెట్లో మద్యం పాలసీని ఆమోదించిన వారందరినీ విచారణ చేయాలని ప్రభుత్వానికి కోరనున్నట్లు వెల్లడించారు.
READ MORE: Madhya Pradesh: నది నుంచి చెప్పులు తీయడానికి ప్రయత్నించి, ప్రాణాలు పోగొట్టుకున్నాడు..
ఇదిలా ఉండగా.. మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు మిథున్‌రెడ్డికి రిమాండ్ విధించింది. ఆగస్టు ఒకటి వరకు రిమాండ్ విధించింది. కాసేపట్లో మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి జైలుకి తరలించనున్నారు. అంతకు ముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధరించడంతో ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరు పర్చారు. మిథున్‌రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. సెక్షన్ 409, 420, 120(బీ), రెడ్‌విత్ 34, 37, ప్రివెన్షన్ ఆప్ కరెప్షన్ యాక్టు 7, 7ఏ, 8, 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది.
READ MORE: Bitra island: “బిట్రా ద్వీపం”లో మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. నేరుగా పాక్, చైనాలపై గురి..