జనం నమ్మట్లేదనే ‘‘జగన్ మారీచ జిత్తులు’’ మళ్లీ ప్రారంభం అయ్యాయని విమర్శించారు టీడీపీ నేత యనమల. దేశంలోనే జగన్ అంత ఫెయిల్యూర్ సీఎం ఎక్కడా లేడు. సొంతపార్టీలోనే అంతర్గత తిరుగుబాట్లతో దిక్కుతోచని స్థితిలో జగన్ ఉన్నారు.ఏపీ పంజాబ్ లా మారిందనే ప్రధాని మోడీ వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.రామరాజ్యం కన్నా రాక్షస రాజ్యంపైనే జగన్ కు మోజెక్కువ.అందుకే ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి ఎగ్గొట్టాడు.జాబ్ కేలండర్ కు పట్టిన గతే జగన్ వెల్ఫేర్ కేలండర్ కు పడుతుంది.జగన్ బటన్ నొక్కుడును జనం నమ్మట్లేదు.తనను నమ్మట్లేదనే విషయం జగన్ రెడ్డికీ తెలిసిపోయింది. జగన్ చెప్పే డిబిటి లబ్ది పొందే వర్గాలతో సహా అందరిలోనూ ఆగ్రహ జ్వాలలే. నాలుగేళ్లలో మున్నెన్నడూ లేనంతగా జీఎస్డీపీ మైనస్ 1.8 శాతానికి దిగజారింది.
Read Also:Online games: ఆన్లైన్ గేమ్ లకు బానిసై.. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య..
ఆంధ్రప్రదేశ్ ను అప్పుల్లో ముంచేశారు. ఏపి అప్పులు రూ 12.50 లక్షల కోట్లకు చేరాయి.లక్షల కోట్ల అప్పులు చేసికూడా ఎందుకిన్ని వైఫల్యాలు..?ప్రజలకు జవాబివ్వాల్సిన బాధ్యత జగన్ రెడ్డిదే.ఎక్సైజ్ రాబడి ప్రభుత్వాదాయం కిందకు రాదనడం హాస్యాస్పదం.ఆదాయం కాకపోతే, బడ్జెట్ బుక్స్ లో రాబడి కాలమ్స్ లో ఎందుకు చూపిస్తున్నావ్..?జగన్ ప్రభుత్వాన్నే కాదు, ఏపిలో ప్రతిఒక్కరినీ అప్పుల ఊబిలోకి నెట్టాడని తీవ్రంగా మండిపడ్డారు యనమల రామకృష్ణుడు.
Read Also: Ravanasura Review: రావణాసుర