NTV Telugu Site icon

Somireddy Chandramohan Reddy: సిలికా శాండ్‌ కుంభకోణంపై విచారణ జరపాలి

Somireddy Chandra

Somireddy Chandramohan Reddy

నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్ కుంభకోణంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. నెల్లూరు సిలికా స్కాం మరో ఓబుళాపురం స్కాం అంటూ సోమిరెడ్డి విమర్శలు.వేలాది కోట్ల రూపాయల లావాదేవీలపై జీఎస్టీ ఎగవేశారని.. సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్.సిలికా అక్రమాలు, జీఎస్టీ ఎగవేతలపై నిర్మలా సీతారామన్ కు లేఖ రాస్తానన్నారు సోమిరెడ్డి. నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున సిలికా శాండ్ స్కాం జరుగుతోంది.నెల్లూరు జిల్లాలో మరో ఓబులాపురం తరహా కుంభకోణం.కర్నూలు జిల్లాలో అనుమతులు తీసుకుని.. నెల్లూరు జిల్లాలో తవ్వకాలు జరుపుతున్నారు.కర్నూలు జిల్లాలో సిలికా శాండ్ క్వాలిటీ ఉండదు.. అందుకని కర్నూల్లో అనుమతులు తెచ్చుకుని నెల్లూరులో తవ్వుతున్నారు.

గతంలో సిలికా శాండ్ లీజు దారులను బెదిరించారు.రూ. కోట్లాది రూపాయల్లో పెనాల్టీలు వేశారు.టన్నుకు రూ. 100 మాత్రమే లీజుదారుకిచ్చి.. మిగిలినదంతా దోచుకుంటున్నారు.టన్ను రూ. 1485కు అమ్ముకుంటూ జీఎస్టీ రూ. 700కే కడుతున్నారు.ఏపీఐఐసీ భూముల్లో అక్రమంగా సిలికా శాండ్ తవ్వకాలను జరుపుతోంటే ఆగింది.ఇప్పుడు 300 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు రెండు కోట్ల టన్నులు ఎత్తేశారు. ప్రభుత్వ, కోస్టల్ కారిడార్, అసైన్డ్, సాగర మాల భూముల్లో మొత్తంగా 3 వేల ఎకరాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి.హైదరబాదుకు నెలనెలా రూ. 27 నుంచి రూ. 30 కోట్లు మామూళ్లు వెళ్తున్నాయి.విజయసాయి రెడ్డికి ముడుపులు వెళ్తున్నాయి.వైసీపీలో చేరిన నెల్లూరు మేయర్ భర్త అతి పెద్ద లీజుదారుడు.. అతనికి రూ. 120 కోట్ల మేర పెనాల్టీలు వేశారు.నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడు మీద పెనాల్టీలు వేస్తున్నారు.78 మంది లీజుదారులు బయటకు వచ్చి పోరాడొచ్చు కదా..? అని సోమిరెడ్డి అన్నారు.

Read Also: Niharika Konidela: వాటిని తింటూ మెగా డాటర్ ఫోజులు.. ఏమన్నా విశేషమా..?

ఎందుకు భయపడతారు..?జీఎస్టీ ఎగ్గొడుతున్న సిలికా లీజుదారుల కంపెనీలు జీఎస్టీ ఎగ్గొడుతోంటే నిర్మలా సీతారామన్ ఏం చేస్తున్నారు..?జీఎస్టీ ఎగవేత మీద సీబీఐతో విచారణ చేయించాలి.సోము వీర్రాజు వచ్చి సిలికా శాండ్ అక్రమాలు తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పినా పట్టదు.కర్నూలు జిల్లా నుంచి 12 లక్షల టన్నుల మేర తవ్వకాలకు అనుమతులు తెచ్చి.. నెల్లూరులో తవ్వుతున్నారు.ఓబుళాపురం స్కాంలో కూడా ఇదే తరహా దోపిడీ జరిగింది.ఓబుళాపురంలో ఎంత మంది జైళ్లకు వెళ్లారో తెలుసు కదా..?60-70 మంది లీజు దారులు వైసీపీ వాళ్లే.. అయినా దోచుకుంటున్నారు.ఏపీఎండీసీ వెంకట్ రెడ్డి చిత్తూరు జిల్లా మంత్రి దిగజారి కాళ్లు పట్టుకున్నారు.అక్రమాలకు సహకరించని అధికారులను గంటలో బదిలీ చేసేస్తున్నారు.గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఏం చేస్తున్నారు..?నిజాయితీగా పని చేశారని ఐఏఎస్ అధికారులు తమ ఇళ్లల్లో వారు చెప్పుకునేలా వ్యవహరించాలి.ఎన్జీటీ కూడా జోక్యం చేసుకోవాలి.సిలికా శాండ్ దోపిడీ, జీఎస్టీ ఎగవేతలపై నిర్మలా సీతారామన్ కు లేఖ రాస్తాం.ఎన్జీటీకి ఫిర్యాదు చేస్తాం.. లీగల్ ఫైట్ చేస్తాం అని హెచ్చరించారు.

Read Also:Clash in Land Dispute: భూవివాదంలో ఘర్షణ.. కర్రలతో దాడికి దిగిన ఇరువర్గాలు