Kakarla Suresh: ఉదయగిరిలో టీడీపీ ప్రచార జోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakarla Suresh: ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయగిరి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. వరికుంటపాడు మండలంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మండల పరిధిలోని కడియం పాడు గ్రామానికి చెందిన 30 కుటుంబాలు, మండల నాయకత్వంలో, మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి పోలుబోయిన శ్రీకాంత్ యాదవ్ సారధ్యంలో వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కాకర్ల సురేష్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ… ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులమై ఆయనకు అండగా నిలవాలని.. మండల నాయకత్వం ఆధ్వర్యంలో టీడీపీలో చేరామన్నారు. పేదల పక్షపాతి పార్టీ తెలుగుదేశం అన్నారు. నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలు అమోఘం అన్నారు. కనుక వీరిద్దరి గెలుపుకి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు.
ఉదయగిరి మండలంలో టీడీపీ విస్తృత ప్రచారం
ఉదయగిరి మండలం నేలటూరు పంచాయతీ సర్వరాబాద్ గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకట రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగామే 13 న జరిగే పోలింగ్ రోజు ప్రజలు ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్దిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీడీపీతోనే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌ను,నెల్లూరు ఎంపీ అభ్యర్థి వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను అఖండ మెజారిటీ తో గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా వున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ బయ్యన్న, మన్నేటి వెంకటరెడ్డి , కాకర్ల రుక్మిణి, శైలజ పెమ్మసాని, జనసేనా మండల కన్వీనర్ సురేంద్ర రెడ్డి, రవీంద్ర, టీడీపీ సీనియర్ నాయకులు ఓబులు రెడ్డి, గడ్డం శ్రీనివాసులు, గడ్డం వెంకటేశ్వర్లు , భరత్,నారాయణ, చిన్న రాయుడు, వెంకట స్వామి,శ్రీరాములు,మాధవ, కిరణ్ కుమార్,హరినాథ్ ,వాసు,లక్ష్మణ్, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
తనయుడి కోసం తల్లి, భర్త కోసం భార్య ఇంటింటి ప్రచారం..!
వరికుంటపాడు మండలం గొల్లపల్లి ,పాపన్న గారి పల్లి, మహందాపురం, ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం తల్లి మస్తానమ్మ, సతీమణి ప్రవీణ వినూత్నంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను, కాకర్ల సురేష్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్, నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నారని వారిద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్ధించారు. అడుగడుగునా పల్లె జనం కర్పూర హారతులు ఇస్తూ పూలు జల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకర్ల ప్రవీణ మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న, ఉదయగిరిలో మార్పు రావాలన్నా, మనకు పెద్దదిక్కు కావాలన్నా తెలుగుదేశం గెలవాలన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మెట్ట ప్రాంత అభివృద్ధి కోసం కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా గెలవాలని, నెల్లూరు జిల్లా అగ్రగామిగా నిలవాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి విజయం చేకూర్చాలని పేర్కొన్నారు. కనుక మే 13న జరుగు ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఆంధ్ర రాష్ట్రంలో మార్పు కోరుకోవాలని చేతులు జోడించి నమస్కారం చేస్తూ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్ రావు, చండ్రా వెంకయ్య, చండ్రా ప్రభాకర్, గంగవరపు పుల్లయ్య, గంగవరపు శివరామయ్య, ఆండ్ర బాల గురువారెడ్డి, భోగినేని శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ మధు నాగభూషణం, లోకసాని రవి, గంగవరపు బాబు, తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!