సీఎం జగన్ పై మండిపడ్డారు టీడీపీ నేతలు. వివేకా కేసులో సీబీఐ అరెస్ట్ నుంచి అవినాశ్ రెడ్డిని కాపాడటానికే హడావుడిగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారని విమర్శించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. రాష్ట్రంలో ఒకపక్క బడ్జెట్ సమావేశాలు, మరోపక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఘోర పరాభవం. సీఎం ఇప్పుడు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమిటి..? తమ్ముడు అవినాశ్ ను రక్షించాలనే ఏకైక లక్ష్యంతోనే ప్రత్యేక విమానాల్లో కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి జగన్ ఢిల్లీ వెళ్లింది నిజం కాదా..? తన అరెస్టును ఆపాలంటూ అవినాశ్ సీబీఐ కోర్టుని ఆశ్రయిస్తే, తీర్పు వెలువడక ముందే, అతన్ని ఢిల్లీ పిలిపించింది, రక్షించడానికే కదా..? అన్నారు వర్ల రామయ్య.
Read Also: TTD EO DharmaReddy: నడిచివెళ్లే భక్తులకు త్వరలో ఉచిత దర్శనం టికెట్లు
బాబాయ్ హత్య కేసు విచారణ కీలక.దశలో ఉండగా, ప్రధాన ముద్దాయి మీతో కలవడం, మీఇంట్లో ఉండటం, అక్కడినుండి మీరు ప్రధాని ఇంటికి వెళ్లడం రాష్ట్ర ప్రయోజనాల కోసమంటే ఎవరు నమ్ముతారు..?గతంలో పరమేశ్వరరెడ్డి భార్య వివేకా హత్య ‘ఇంటి మనుషుల పనే’ అంటే మీరెవరూ ఎందుకు ఆమె మాటల్ని ఖండించలేదు?దేశమంతా ‘జస్టిస్ ఫర్ వివేకా’ అని నినదిస్తుంటే, మీరుమాత్రం ‘సేవ్ మై బ్రదర్’ అని ఢిల్లీకి ప్రయాణం కట్టడం ఎంతవరకు సబబు..?తెలంగాణ హైకోర్టు స్పష్టంగా సీబీఐ తదుపరి దర్యాప్తుకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇస్తే, మీ తమ్ముడి తరుపున మీరు ‘రెడ్ సిగ్నల్’ ఎందుకు వేస్తున్నారు..? అని విమర్శించారు వర్ల రామయ్య.
Read Also: CM Jagan : ప్రధాని మోడీ సీఎం జగన్ భేటీ.. చర్చించిన అంశాలు ఇవే