Site icon NTV Telugu

Atchannaidu: ప్రజా బలం ఉన్న నాయకుడు చంద్రబాబు..

Atchanna 1

Atchanna 1

Atchannaidu: చంద్రబాబుకి మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు ఇబ్బందేంటని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ భూమ్మీద తానే అపర మేధావిని అన్నట్టు సజ్జల ఫీలవుతున్నారని ఆయన విమర్శించారు. నిన్న చంద్రబాబుకి మద్దతు తెలిపేందుకు వచ్చిన జనసందోహాన్ని చూసి సీఎం జగన్ సహా వైసీపీ నేతలు వణికిపోతున్నారన్నారు. కోర్టు నిబంధనలున్నా చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వేలాది మంది జనం వచ్చారన్నారు. కోర్టు నిబంధనలు లేకుంటే అంతకు నాలుగు రెట్లు జనం వచ్చేవారని.. చంద్రబాబుని, లోకేశ్‌ని చూసి వైసీపీ నేతలు ఎందుకంత వణికిపోతున్నారని ఆయన ప్రశ్నించారు.

Also Read: Pawan Kalyan: తిరుపతి వెంకన్నను చూసినప్పుడు కూడా ఇంత సంతోషపడలేదురా..

లోకేశ్ ఢిల్లీ వెళ్తే వైసీపీ నేతలు గల్లీల్లో పెడబొబ్బలు పెడుతున్నారన్నారు. చంద్రబాబు బెయిల్‌పై బయటకొస్తే వైసీపీ నేతలు వణికిపోతున్నారని ఆయన అన్నారు. స్కిల్ కేసులో ఒక్క ఆధారం సేకరించలేకపోయారని.. ఇప్పుడు మద్యంలో అక్రమాలంటూ చంద్రబాబుపై మరో అక్రమ కేసు పెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రజా బలం ఉన్న నాయకుడు చంద్రబాబు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా టీడీపీ జెండా దారంలోని నూలు పోగును కూడా పీకలేరన్నారు. మరో 5 నెలల తర్వాత వైసీపీ నేతల్ని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయమన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు.

Exit mobile version