TDP-Janasena-BJP Manifesto: ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల.. కీలక హామీలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP-Janasena-BJP Manifesto: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను మూడు పార్టీల నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు, పవన్ కల్యాణ్, సిద్జార్థ్ నాథ్ సింగ్‌లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మూడు పార్టీలకు వచ్చిన వినతులతో మేనిఫెస్టో రూపొందించామన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలతో మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. ఏపీ భవిష్యత్తు కత్తి మొన మీద వేలాడుతోందని.. గత ఐదేళ్లుగా ఏపీలో అశాంతి, అరాచకమే ఉందన్నారు. రూ. 10లు ఇచ్చి.. రూ. 100 కొట్టేసింది వైసీపీ అని పవన్ ఆరోపించారు. పోలవరం, నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచారన్నారు. అన్నక్యాంటీన్లు సహా వివిధ సంక్షేమ పథకాలను రద్దు చేశారని.. ప్రతి కుటుంబంపై రూ. 8 లక్షల మేర అప్పు ఉందన్నారు. అన్ని వర్గాలను నాశనం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. విధ్వంస పాలనను సాగనంపాలి.. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సూపర్ సిక్స్.. షణ్ముఖ వ్యూహం వంటివి ఇప్పటికే ప్రకటించామన్నారు. సమగ్ర ఇసుక విధానం తీసుకొస్తామని.. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామన్నారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేపడతామన్నారు.
Read Also: Jr NTR: టీడీపీ ర్యాలీలో ఎన్టీఆర్ కి పాలాభిషేకం
Also Read
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. “బీజేపీ దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది. టీడీపీ – జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశాం.ప్రజలను గెలిపించేందుకే మా కలయిక. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే మేం సర్దుబాటు చేసుకున్నాం. 20 లక్షల మంది యువతకు ఉపాధి. నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. తల్లికి వందనం ఒక్కో బిడ్డకు రూ. 15 వేలు. స్కిల్ గణన చేపడతాం. ఎంఎస్ఎంఈలకు ప్రొత్సాహాకాలు. 10 శాతం EWS రిజర్వేషన్లు అమలు చేస్తాం. మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం. మత్స్యకారులను ఆదుకుంటాం. సంపద సృష్టిస్తాం.. ఆదాయాన్ని పంచుతాం. అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు ఇస్తాం. ” అని చంద్రబాబు మేనిఫెస్టోలోని హామీల గురించి తెలిపారు. ఉద్యోగులు చాలా నష్టపోయారని.. ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద నిలబెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ ఏం ఇవ్వడం లేదని.. ఉద్యోగుల్లో ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతామన్నారు.
ఎన్డీయే హామీల్లో ముఖ్యమైనవి ఇవే..
*20 లక్షల మంది యువతకు ఉపాధి
*మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం.
*మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం
*దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితం.
*ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేత.
*నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.
*‘తల్లికి వందనం’ కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం.
*ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు
*బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు.
*బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు.
*బీసీ కార్పోరేషన్లను ఆర్థికంగా బలోపేతం
*బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ. 10 వేల కోట్లు.
*ఆధునిక పని ముట్లతో ఆదరణ పథకం అమలు
*పవర్ లూం, హ్యాండ్ లూంలకు కొంత మేర ఉచిత విద్యుత్.
*డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
*ఆడపిల్లల విద్యకు కలలకు రెక్కలు పథకం.. వడ్డీ లేని రుణాలు
*పీఆర్సీ ప్రకటన.. ఆలోగా ఇంటెరిమ్ రిలీఫ్
*సీపీఎస్ రద్దు సమస్యపై కసరత్తు చేసి పరిష్కారం
*వాలంటీర్లకు రూ. 10 వేలు జీతం.
*EWS రిజర్వేషన్ల నుంచి కాపులకు దామాషా పద్దతిన రిజర్వేషన్లు అమలు
*అగ్ర వర్ణ పేదలకు న్యాయం
*రూ. 4 వేలు పెన్షన్.. ఏప్రిల్ నుంచి అమలు
*వికలాంగులకు రూ. 6 వేలు పెన్షన్.
*పూర్తి వికలాంగులకు రూ. 10 వేల పెన్షన్.
*ఇప్పటికే మంజూరైన ఇళ్ల పట్టాల్లో ఇళ్ల నిర్మాణం
*విజయవాడలో హజ్ హౌస్.
*డ్రైవర్లకు రూ. 15 వేలు.
*చంద్రన్న భీమా అమలు
*ప్రతి కుటుంబానికి జీవిత భీమా.
*హెల్త్ కార్డ్స్ అందజేత
విద్యుత్ ఛార్జీలు నియంత్రణ
*చెత్త పన్ను రద్దు .. ఇంటి పన్నులపై సమీక్ష.
*ఉచిత ఇసుక విధానం అమలు
*కేజీ టూ పీజీ సిలబస్ రివ్యూ
*విదేశీ విద్య అందరికీ వర్తింపు
*వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ కంట్రోల్
*అమరావతిలో ప్రజా రాజధాని నిర్మాణం.
*ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అధిక ప్రాధాన్యం.
*దేవాలయాలు.. బ్రహ్మణుస సంక్షేమానికి పెద్ద పీట.
*హిందూ ఆస్తుల పరిరక్షణ.



తాజావార్తలు
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!