Site icon NTV Telugu

Chandrababu: ఎన్టీఆర్‌ టీడీపీని ప్రారంభించిన గొప్ప రోజు ఇది..

Chandrababu

Chandrababu

Chandrababu: వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ అన్ స్థాపబుల్ అని.. ఎక్కడ చూసినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు ప్రసంగించారు. తెలుగు జాతికి ఈ రోజు ఎంతో గొప్పరోజు అన్న ఆయన.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారన్నారు. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు వచ్చానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ వచ్చినప్పటి నుంచి బాదుడే బాదుడు అని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని ఆయన విమర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. డీఎస్సీని పూర్తిగా ఇవ్వలేదన్న ఆయన.. ఐదేళ్లలో అందరూ నష్టపోయారన్నారు.

Read Also: MP Nandigam Suresh: పేదల పట్ల ఎప్పుడూ చంద్రబాబుకు ప్రేమ లేదు..

టీడీపీ వల్లే ప్రజలకు భవిష్యత్ ఉంటుందన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. చాలా కాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశానని.. కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని మాత్రం చూడలేదన్నారు. ప్రజాస్వామ్యంపై జగన్‌కు నమ్మకం లేదని.. అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే పోలీసులు, సీఐడీ ద్వారా కేసులు పెట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ‘చాలా మంది భయపడుతున్నారు. స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు. నంద్యాలలో అబ్దుల్‌ను హింసించారు. కావలిలో ఎమ్మెల్యే ఆగడాలు భరించలేక కరుణాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కుటుంబాన్ని టీడీపీ ఆదుకుంది. బాబాయ్‌ని చంపిన వ్యక్తికి ఓటు వేయాలని కోరుతున్నారు ప్రతి చోటా అరాచకాలే.. ఎవరికీ రక్షణ లేదు” అని చంద్రబాబు ఆరోపించారు.

టీడీపీ అధికారంలోకి వస్తే పోలీస్ రిక్రూట్‌మెంట్‌ను కూడా నిర్వహిస్తామని చంద్రబాబు హామీలు గుప్పించారు. ప్రజల కోసమే జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేశారన్నారు. మైనారిటీలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ అని ఆయన తెలిపారు. ఇప్పుడు మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నరు. అవినీతి పరుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఢీ కొట్టేందుకే కావ్య కృష్ణా రెడ్డిని రంగంలోకి దింపామన్నారు. ఆయన విజయం ఖాయమన్నారు. మత్స్యకారులను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

 

Exit mobile version