NTV Telugu Site icon

Chandrababu: నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు..

Chandrababu

Chandrababu

Chandrababu: దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా దొంగ ఓట్లు సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్చడం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై ధర్నా చేస్తున్న సమయంలో గాయపడిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పులివర్తి నానిని చంద్రబాబు పరామర్శించారు. చంద్రగిరిలో దొంగ ఓట్ల అంశాన్ని ఈసీ కేస్‌ స్టడీగా తీసుకోవాలని ఆయన కోరారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. పుంగనూరు, నగరి, తిరుపతి, చంద్రగిరి సహా పలు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. చంద్రగిరిలో 28 వేల ఓట్లను కొత్తగా చేర్చారని.. 13 వేలకు పైగా ఓట్లు ఒకే ఫోటోతో ఉన్నాయన్నారు. తిరుపతికి చెందిన వ్యక్తిని చంద్రగిరిలో రెండు ఓట్లుగా చేర్చారని ఆయన ఆరోపించారు.

Read Also: CM YS Jagan: రేపు సీఎం జగన్ శ్రీసత్య సాయి జిల్లా పర్యటన

ఈసీ కూడా గత తిరుపతి ఉపఎన్నికల విషయంలో సీరియస్‌గా రియాక్టు అయ్యిందని గుర్తు చేశారు. పులివర్తి నాని ఆరునెలలుగా పోరాటం చేశారని.. అలా పోరాటం చేస్తూ నాని ఆత్మహత్యాయత్నం చేశారని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా భూకబ్జాలు, దౌర్జన్యాలు పెరిగాయన్నారు. అ డబ్బులతో గెలవాలని చూస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలలో తప్పులు చేయలేదు .. కానీ వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా దొంగ ఓట్లపై దృష్టి పెట్టిందని ఆయన అన్నారు. పోలీస్ వ్యవస్థ భృష్టు పట్టిందని, ఈసీ సీరియస్‌గా ఉండటంతో ఇప్పుడు పోలీసుల్లో భయం వచ్చిందన్నారు. తప్పుచేసిన ఆర్వోను అరెస్టు చేయాలన్నారు. అరెస్టు చేస్తే విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.