కల్తీకి కాదేది అనర్హం అని నిరూపిస్తున్నారు కేటుగాళ్లు, కల్తీ పాలు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, చాయపత్త, పన్నీర్ ఇలా పలు రకాల ఆహార పదార్థాలను పలు రకాల రసాయనాలను ఉపయోగించి కల్తీ ఆహారపదార్ధాలను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఈజీగా మనీ సంపాదించుకునేందుకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో వేల కిలోల్లో కల్తీ పన్నీర్ బయటపడడంతో అధికారులతో సహా అంతా షాక్ అయ్యారు.
Also Read:Russia-India: ఉగాది వేళ భారత్‌కు శుభపరిణామం.. నడిసంద్రంలో చైనాకు రష్యా ట్యాంకర్ షాక్
కల్తీ పన్నీర్ తయారీ కేంద్రంపై ఫుడ్ ఇన్స్పెక్టర్ తో సహా ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు వేల కిలోలకు పైగా కల్తీ పన్నీర్ ను సీజ్ చేశారు ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్, విజయ్ మిల్క్, కర్డ్ షాపు తో సహా ఆరు షాపులపై దాడులు చేశారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్ లో 1600 కిలోల పన్నీర్ ను సీజ్ చేశారు. విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాప్ లో1000 కిలోల కల్తీ పన్నీర్ సీజ్ చేశారు. నిర్వాహకులు నగరంలో పలు ప్రాంతాల్లో కల్తీ పన్నీరు అమ్ముతున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
