తరుణ్ భాస్కర్ దాస్యం ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు సినిమాలతో తరుణ్ భాస్కర్ మంచి దర్శకుడిగా గుర్తింపు సంపాదించాడు. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గానే కాకుండా యాక్టర్ గా కూడా అద్భుతంగా రానిస్తున్నాడు. మహానటి, సీతారామం వంటి సినిమాలలో నటించి మెప్పించాడు. అలాగే హీరోగా మీకు మాత్రమే చెప్తా సినిమా కూడా చేసాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.అయితే తాజాగా తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రం కీడా కోలా… క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్ ను అందించారు మేకర్స్.. అక్టోబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు ఈ సినిమాట్రైలర్ లాంఛ్ చేయనున్నట్టు తెలియజేస్తూ కొత్త లుక్ ను కూడా విడుదల చేశారు.
వీజీ సైన్మా బ్యానర్ పై కే వివేక్ సుధాన్షు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి బ్రహ్మానందం పాత్ర లుక్‌ను విడుదల చేశారు. బ్రహ్మీ ఇందులో వరదరాజులు (తాత) పాత్రలో కనిపించబోతున్నట్టు తెలియజేశారు. రవీంద్ర విజయ్, హరికాంత్ మరియు రఘురామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీడా కోలా తరుణ్ భాస్కర్ తొలి పాన్ ఇండియా సినిమా కావడం గమనార్హం ఈ చిత్రానికి ఏజే ఆరాన్ సినిమాటోగ్రఫర్ కాగా.. ఉపేంద్ర వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.అయితే ఈ విషయం పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.కీడా కోలా సినిమాతో తరుణ్ భాస్కర్ మరో సారి యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేయనునట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..