Summer Holidays: వేసవి సెలవుల్లో అనారోగ్యం పాలవ్వకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Summer Holidays: ప్రస్తుతం వేసవి కలం కావడంతో స్కూల్స్‌కి సెలవులు రావడం సహజమే. ఈ పరిస్థితులలో పిల్లలు ఇళ్లలోనే గడిపే పరిస్థితి నెలకొంది. ఇంతకాలం ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లే సాయంత్రానికి తిరిగి వచ్చే అలవాటులో ఉన్న పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఎక్కువ సమయం ఉంటారు. అయితే వేసవి కాలంలో పిల్లలు వేడి, తేమ, ధూళి, కాలుష్యం వంటి సమస్యల మధ్య వారి ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. మరి వాటి కోసం తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అందుకోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అవేంటో ఒక లుక్ వేద్దామా..
Read also: Heavy Rains : అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షలు.. అప్రమత్తమైన ప్రభుత్వం
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
వేసవి వేడి తీవ్రంగా ఉండే ఈ సమయంలో పిల్లలకు చిరాకు పెట్టించే పాపులర్ పాలిస్టర్ బట్టలు కాకుండా, తేలికగా ఉండే కాటన్ దుస్తులను వేయించడం మంచిది. ఇవి శరీరానికి తేమను ఇబ్బంది పెట్టకుండా ఉంచి, చర్మం ఇరుకుగా లేకుండా ఉడికిపోవడాన్ని తగ్గిస్తాయి. ఒకవేళ పిల్లలు బయటకు వెళ్లే అవసరం వస్తే దోమలు, ఇతర కీటకాల నుంచి కాపాడేందుకు లోషన్స్ వాడాలి. ఇది చర్మాన్ని రక్షిస్తూ దద్దుర్లు, తామర వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇంకా వేసవిలో చెమట ఎక్కువగా రావడం వల్ల చర్మ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని నివారించేందుకు సహజమైన నేచురల్ రెమిడీస్, సన్‌స్క్రీన్ లోషన్‌లు, మాయిశ్చరైజర్‌లు ఉపయోగించాలి. ఇవి UV కిరణాల ప్రభావాన్ని తగ్గించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి.
సెలవుల్లో పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటారు. ఇంకా క్యార్బొనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటారు. ఇది గ్యాస్, కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలకు దారితీస్తుంది. వీటిని నివారించేందుకు శుభ్రమైన, ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని అందించడం ద్వారా భయటపడవచ్చు. పిల్లలు బయట ఆడి ఇంటికి వచ్చిన వెంటనే చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. లేకపోతే క్రిములు ఇంట్లోకి చేరి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఆటల్లో మునిగిపోయే పిల్లలు ఎక్కువగా నీరు తాగడం మరిచిపోతారు. దీని వల్ల డీహైడ్రేషన్‌కి లోనవుతారు. కాబట్టి వారిని తరచూ నీరు తాగమని చెప్పాలి. అలాగే పండ్ల రసాలు, నారింజ జ్యూస్ వంటి హైడ్రేటింగ్ పానీయాలు ఇవ్వాలి.
సెలవుల్లో పిల్లలు స్నాక్స్‌కు అలవాటు పడిపోతారు. దీంతో వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ఇంట్లోనే తయారుచేసి ఇవ్వాలి. వేసవి తాపం తీవ్రమవుతున్న నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో పిల్లలను బయటకు పంపకుండా చూడాలి. అవసరమైతే మాత్రమే, అది కూడా ఉదయం లేదా సాయంత్రం చల్లగా ఉన్న సమయంలోనే బయటకు పంపాలి. సూర్యుని నుండి వచ్చే ప్రమాదకర UV కిరణాలు, గాలిలో కలిసిన కాలుష్య కారణాలు పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. వీటిని నివారించేందుకు ఇంటిలో శుభ్రత పాటించాలి, అవసరమైతే మాస్కులు వాడించాలి. మొత్తంగా వేసవి సెలవుల్లో పిల్లలు ఆనందంగా గడపడం కంటే ముందు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. పై సూచనలు పాటిస్తూ వారి ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే, పిల్లలు ఈ సెలవులను ఆరోగ్యంగా, సురక్షితంగా గడిపే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!