ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతుంది. ఓటీటీ లలో సినిమాలు మరియు వెబ్ సిరీసులు మంచి ఆదరణ పొందుతున్నాయి. నేరుగా ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలతో పాటుగా థియేటర్లలో అంతగా ప్రేక్షకాదరణ పొందని చిత్రాలు కూడా ఓటీటీ లలో మంచి ఆదరణ పొందుతున్నాయి. అలా రీసెంట్ గా ఓటీటీలో విడుదల అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న తెలుగు హారర్ మూవీ “తంతిరం: టేల్స్ ఆఫ్ శివకాశి చాప్టర్ 1”.శ్రీకాంత్ గుర్రం మరియు ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన తంతిరం టేల్స్ ఆఫ్ శివకాశి చిత్రానికి ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను బండి పతాకంపై శ్రీకాంత్ కంద్రుగుల నిర్మించారు.ఈ సినిమాలో అవినాష్ ఎలందూరు కీలక పాత్ర ను చేశాడు. ఈ సినిమా కు అజయ్ అరసాడ సంగీతం అందించారు. అలాగే ఎస్. వంశీ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.తంతిరం మూవీ ఇటీవల దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న థియేటర్ల లో విడుదలైంది.
సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో తంతిరం సినిమా గురించి ప్రేక్షకుల లో అంత బజ్ క్రియేట్ అవ్వలేదు.దీనితో థియేటర్ల లో విడుదలైన కొన్ని రోజులకే మాయమైపోయింది.తాజాగా తంతిరం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే సైలెంట్ గా ఈ సినిమా ఓటీటీలో విడుదల అయి ప్రేక్షకులను ఎంతగానో భయపెడుతోంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 11 నుంచి తంతిరం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.భార్యా భర్తల మధ్య ఓ ఆత్మ ప్రవేశిస్తే.. వారి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనే కథాంశంతో తంతిరం సినిమా తెరకెక్కింది. అలాగే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ మొదటి పార్ట్ లో హింట్ ఇచ్చారు. హారర్ అండ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు తంతిరం సినిమా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.