NTV Telugu Site icon

Tammineni Veerabhadram: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల స్వభావం మాకు తెలుసు..

Tammineni

Tammineni

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మేము ఒంటరిగా పోరాటం కోరుకున్నది కాదు.. మా మిత్రుత్వం కాంగ్రెస్ కాదనుకుంది.. అందుకే 19 నియోజకవర్గలో పోటీ చేశామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల స్వభావం మాకు తెలుసు అని తమ్మినేని చెప్పుకొచ్చారు. రెండు పార్టీలు భూర్జువా స్వభావం కలిగి ఉన్నవే.. బీఆర్ఎస్ ది అహంకార ధోరణి.. కుటుంబ పాలనతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.. కేసీఆర్, కమ్యూనిస్టులను పక్కన పెట్టి తప్పుడు ప్రచారం చేశారు అని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

Read Also: DK Shivakumar: కాంగ్రెస్ వేవ్ ఉంది.. తెలంగాణలో గెలుస్తుంది.. మరల ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది..!

మునుగోడు ఎన్నికల తర్వాతనే బీజేపీ డౌన్ ఫాల్ అయ్యింది అని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు సీట్ల సర్దుబాటులో తేడా రాలేదు అని చెప్పారు. ఇండియా కూటమిలో ఉన్న మీకు.. దూరంగా ఉన్న మాకు పొత్తు ఏంటి అని బీఆర్ఎస్ అడిగింది.. కాంగ్రెస్ తోడ్పాటు లేకుండా బీజేపీని దేశం నుండి తప్పించలేము అని ఆయన పేర్కొన్నారు. సీపీఐ.. సీపీఎం ఇద్దరం పోటీ చేద్దాం అనుకున్నాం.. కానీ కాంగ్రెస్ అధిష్టానం చర్చల అంశం మొదలు పెట్టింది.. బీజేపీ లాంటి రాక్షసిని అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ దయ్యం బెటర్ అనుకున్నామని తమ్మినేని వీరభద్రం తెలిపారు.

Read Also: Vadhuvu : ఓటీటీ లో కి రాబోతున్న అవికా గోర్ ‘వధువు’ వెబ్ సిరీస్..

బీజేపీకి భయపడి కేసీఆర్ దూరం చేశారు మమ్మల్ని అని తమ్మినేని వీరభద్రం చెప్పారు. కామ్రేడ్స్ తో పొత్తు లేకుండ.. పీసీసీలో గ్రూపులలో ఎవరు అభ్యంతరం చెప్పారో తెలియదు.. కాంగ్రెస్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారా చెప్పండి అన్నారు.. ఖమ్మంలో సీటు లేకుండా పొత్తు ఉహించగలమా?.. త్రిపురలో పీసీసీకి మా సిట్టింగ్ కాంగ్రెస్ వదిలేశాము అని ఆయన చెప్పారు. తెలంగాణలో ఆ త్యాగం ఎందుకు చేయదు కాంగ్రెస్ అని తమ్మినేని ప్రశ్నించారు. భట్టి కూడా పాలేరు, మిర్యాలగూడ ఒప్పుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గుర్తు చేశారు. పాలేరులో బలమైన నాయకుడు పొంగులేటి వచ్చారు ఇవ్వలేం అన్నారు.. ఏ సీటు ఇస్తారో చెప్పండి అంటే సమాధానం ఇవ్వలేదు.. వైరా, మిర్యాలగూడకి అంగీకారం కుదిరింది.. తర్వాత వైరా లేదు మిర్యాలగూడ ఒక్కటే ఇస్తామన్నారు.. కురదు అని చెప్పామని తమ్మినేని వీరభద్రం అన్నారు.

Show comments