కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం గుడ్ బై చెప్పింది. పొత్తులు, అభ్యర్థులపై కాంగ్రెస్‌కు సీపీఎం డెడ్‌లైన్ విధించింది. అయితే… డెడ్‌లైన్ దాటిపోవడంతో పోటీ చేసే స్థానాల లిస్ట్ సీపీఎం విడుదల చేసింది. 17 మంది అభ్యర్థులతో కూడిన సీపీఎం జాబితాను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన తాత్సారం కారణంగా సీపీఎం పోటీ చేసే స్థానాల లిస్ట్ ప్రకటిస్తున్నామన్నారు. భద్రాచలంలో గత 8 పర్యాయాలు సీపీఎం గెలిచిందని, భద్రాచలం కోరాము…కానీ ఇవ్వమన్నారు… తరువాత పాలేరు అన్నాము… జాతీయ స్థాయిలో అంగీకరించారు… కానీ అది కూడా ఇవ్వామన్నారన్నారు. ఆ తరువాత వైరా, మిర్యాలగూడ అన్నారు…. అదేదో మేము పట్టు మీదున్నము అని కొన్ని పత్రికల్లో రాయించారు… చర్చ చేయించారన్నారు వీరభద్రం. మీరన్న వైరా, మిర్యాలగూడ కూడా ఇవ్వకుండా ఇప్పుడు మాట మార్చారని, మిర్యాలగూడ ఇస్తారట… మరొక సీట్ హైద్రాబాద్ లో ఇస్తారట… అంటే చంద్రయన గుట్ట ఇస్తారో ఎది ఇస్తారో క్లారిటీ లేదన్నారు.
అంతేకాకుండా..’మేము అనుకున్న ఆ రెండు సీట్లు ఇస్తే ఒకే అనుకున్నాం లేదా పోటీ చెయ్యాలని మా పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించాం… అందుకే ఒంటరిగా వెళ్ళాలి అని నిర్ణయిం తీసుకున్నాం… మేము ఇలా వెళ్ళడం మంచిది కూడా కాదు… కానీ మమ్మల్ని ఇలా అవమనిచడం సరైంది కాదు… ఇటువంటి పద్దతి సరైంది కాదు కాంగ్రెస్ కి… వేరే ఒక నాయకుడు మీడియా తో మాట్లాడుతూ మాకు mlc ఇచ్చి మంత్రి పదవి ఇప్పిస్తడట… ప్రధాన మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నము.. అయితే దీనిపై సీపీఐ తో ఇప్పటివరకు చర్చించాము… మేము ప్రకటించక తప్పలేదు… వారికి రేపు మీడియా ముఖంగా చెప్తాము అని అన్నారు… అనివార్య పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళడానికి సిద్ధమయ్యాము….. రాష్ట్ర వ్యాప్తంగా 24 నియోజకవర్గాల్లో పోటీ చెయ్యాలని నిర్ణయించాం… ఇప్పుడు 17 సీట్లు ప్రకటిస్తున్నాము… రెండో లిస్ట్ లో కొన్ని చేరుతాయి… ఇప్పుడున్న వాటిల్లో కూడా cpi తో సర్దుబాటు కూడా జరగవచ్చు…
ఖమ్మం అన్ని స్థానాలు… మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, పాలేరు…. కొత్తగూడెం…లో భద్రాచలం.. అశ్వరావుపేట్… నల్గొండ లో మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్, యాదద్రి భువనగిరి లో భువనగిరి.. సూర్యాపేట… హుజూరాబాద్, కోదాడ, రంగారెడ్డి… ఇబ్రహీం పట్నం, హైద్రాబాద్… ముషీరాబాద్.. స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. పేదల గొంతు అసెంబ్లీ లో వినబడాలి అంటే… లెఫ్ట్ నీ గెలిపించండన్నారు. ఎక్కడున్నా బీజేపీనీ ఓడించడానికి బీఆర్‌ఎస్‌కి కూడా సపోర్ట్ చేస్తామన్నారు. ప్రజాతంత్ర లౌకిక శక్తులు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సీపీఐ పోటీ చేసే సీట్లలో సీపీఎం పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ మాతో కలిసి వస్తె ఒకే… వెల్ అండ్ గుడ్… లేకపోతే వారు కాంగ్రెస్ తో పొత్తు తో చెన్నూర్… కొత్తగూడెం లో పోటీ చేస్తే సీపీఎం వారికే మద్దత్తు తెలపాలి అని నిర్ణయం తీసుకున్నామన్నారు.