Site icon NTV Telugu

Tammineni Veerabhadram : బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే లక్ష్యంతో పోరాటాలు చేస్తాం

Tammineni Veerabhadram

Tammineni Veerabhadram

వచ్చే ఎన్నికల్లో కలిసి వచ్చే శక్తులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే లక్ష్యంతో పోరాటాలు చేస్తామన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుల, సంస్థలపై, వ్యక్తులపైన ఈడి, సీబీఐ దాడులు జరుగుతున్నాయి తప్ప…. ప్రధానమంత్రి మోడీ అనుచరుడైన ఆదాని, అతని సంస్థలపై ఎందుకు సీబీఐ, ఐటీ దాడులు జరగడంలేదని తమ్మినేనీ వీరభద్రం ప్రశ్నించారు. దేశంలో రోజురోజుకు బీజేపీ నియంతృత విధానాలు పెరిగిపోతున్నాయని, అందులో భాగంగానే మీడియా సంస్థలపై దాడులు జరుగుతున్నాయన్నారు తమ్మినేనీ వీరభద్రం.

Also Read : Tulluri Brahmaiah : పల్లా రాజేశ్వర రెడ్డికి చప్రాసి గిరి ఫలితమే మీకు ఎమ్మెల్సీ పదవి

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి పోరాటాలకు సన్నద్ధం అవుతామన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌తో రానున్న ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని తమ్మినేనీ వీరభద్రం స్పష్టం చేశారు. ఇంతవరకు సీపీఎం, బీఆర్ఎస్ ల మధ్య సీట్ల పొత్తు విషయంలో చర్చలు జరగలేదని ఆయన వెల్లడించారు. దేశంలో మతతత్వ దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రధాని మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న పోడు భూముల సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆయన కోరారు. మార్చి 15 నుంచి 30 వరకు కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను నిరసిస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జాతాను నిర్వహిస్తామని తమ్మినేనీ వీరభద్రం వెల్లడించారు.

Also Read : Naresh-Pavitra: మీ వయస్సుకు తగ్గ పనులు చేస్తే ఎవరు ట్రోల్ చేయరు

Exit mobile version