Tamilnadu: హిందూ మహాసముద్రంలోని కేప్ కొమొరిన్ సమీపంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో ఆదివారం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంటంలో వరదల కారణంగా దాదాపు 800 మంది రైల్వే ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆలయ పట్టణం తిరుచెందూర్ నుండి చెన్నైకి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికులు నిన్నటి నుండి వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతమైన శ్రీవైకుంటం వద్ద చిక్కుకుపోయారు. తూత్తుకుడిలో ఇప్పటివరకు 525 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీవైకుంటంలో రైల్వే లైన్ కింద మట్టి కోతకు గురైంది. సిమెంట్ స్లాబ్‌కు అమర్చిన ఇనుప పట్టాలు దానికి వేలాడుతూ ఉన్నాయి. చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారులు బాధ్యతలు స్వీకరించారని ఒక అధికారి తెలిపారు. తిరుచెందూర్-చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 20606) డిసెంబర్ 17న రాత్రి 8.25 గంటలకు తిరుచెందూరు నుండి చెన్నైకి బయలుదేరింది. భారీ వర్షాలు, వరదల కారణంగా తిరుచెందూర్‌కు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవైకుంటం రైల్వే స్టేషన్‌లో రైలు నిలిచిపోయింది.
Read Also:Chandrababu Bail: నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ
మొత్తం 800 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని, వారిలో 500 మంది శ్రీవైకుంటం రైల్వే స్టేషన్‌లో, 300 మంది సమీపంలోని పాఠశాలల్లో ఉంటున్నారని ఆయన చెప్పారు. తిరునెల్వేలి-తిరుచెందూర్ సెక్షన్‌లోని శ్రీవైకుంటం-సెడుంగనల్లూర్ మధ్య రైలు పట్టాలు వరదల్లో పూర్తిగా మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. రానున్న 24 నుంచి 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం, వరదల దృష్ట్యా దక్షిణ రైల్వే 15 రైళ్లను రద్దు చేయగా, పలు రైళ్ల మార్గాలను మార్చింది. తుపాను కారణంగా విమానాల రాకపోకలపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. ఈరోజు దక్షిణాది జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు మూతపడ్డాయి. తిరునెల్వేలి, టుటికోరిన్, తెన్కాసి మరియు కన్యాకుమారిలలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వరదల కారణంగా ఈ జిల్లాల్లో ఇప్పటివరకు 7500 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ జిల్లాల్లో రాష్ట్ర విపత్తు సహాయ దళం, జాతీయ విపత్తు సహాయ దళానికి చెందిన 250 మందికి పైగా సిబ్బందిని మోహరించింది. దక్షిణ తమిళనాడులోని 39 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాసి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ తమిళనాడులో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ బులెటిన్‌లో తెలిపింది. డిసెంబర్ 19న కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Read Also:Andrapradesh : జైలు బయట తల్లి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..