Tamil Nadu Minister: పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న మంత్రి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Minister: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కూర్చోవడానికి కుర్చీ తీసుకురాలేదని పార్టీ కార్యకర్తలపై మంత్రి ఎస్ఎం నాజర్ రాయి విసిరిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ పార్టీ కార్యకర్తను మెడపట్టి నెట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడులోని సేలంలో ఓ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను కలిసేందుకు రాష్ట్ర యువజన శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్టేజ్‌పై నిలుచున్నారు. కార్యకర్తలు వరుసగా ఉదయనిధిని కలిసి కరచాలనం చేస్తున్నారు. ఓ కార్యకర్త వరుసలో వస్తూ స్టాలిన్‌తో కరచాలనం చేసేందుకు ముందుకు వచ్చాడు. అక్కడే ఉన్న మంత్రి కేఎన్ నెహ్రూ స్టాలిన్‌తో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించిన పార్టీ కార్యకర్తను నెట్టడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. గురువారం రాష్ట్ర మంత్రిగా ఉదయనిధి తొలి పర్యటన సందర్భంగా పార్టీ సేలం తూర్పు జిల్లా విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనేక మంది కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
PM Narendra Modi: స్టూడెంట్ అడిగిన ‘విమర్శ’ ప్రశ్న.. ‘సిలబస్’ జవాబుతో చమత్కరించిన మోడీ
ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీల నుంచి తక్షణమే విమర్శలు వెల్లువెత్తడంతో పాటు డీఎంకే మంత్రులు ప్రజలను కొట్టేందుకు ప్రతిజ్ఞ చేశారని బీజేపీ రాష్ట్ర చీఫ్ కే అన్నామలై వ్యాఖ్యానించారు. ఈ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తూ.. “డీఎంకే మంత్రులు ప్రజలను కొట్టడానికి ప్రతిజ్ఞ తీసుకున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఒక మంత్రి రాళ్లు విసిరారు. మరొక మంత్రి ఇప్పుడు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇవన్నీ రోజూ ఉంటాయి. . మమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి ఇక్కడ నుంచి మాకు రక్షణ పరికరాలను సరఫరా చేయమని ముఖ్యమంత్రిని అభ్యర్థించండి!” అంటూ అన్నామలై పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నాయకులు, ప్రజలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Looks like DMK Ministers have taken a pledge to beat up people.
A minister throwing stones a few days back & another minister roughing up people now. All of these on a daily basis
Request @CMOTamilnadu to supply us protective equipments from here on to keep us safer! pic.twitter.com/HNuB0bYXUV
— K.Annamalai (@annamalai_k) January 27, 2023
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!