Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Tamil Nadu Indigo Airlines Hoax Bomb Threat Accused Arrested

Bomb Threat : విమానానికి బాంబు బెదిరింపు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Published Date :June 23, 2024 , 2:13 pm
By Rakesh Reddy
  • చెన్నై నుంచి ముంబై వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు
  • విమానాశ్రయంలో భద్రతను పెంచిన పోలీసులు
  • నిందితుడిని అరెస్ట్ చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్
Bomb Threat : విమానానికి బాంబు బెదిరింపు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bomb Threat : కొద్ది రోజుల క్రితం చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారతదేశంలోని 41 విమానాశ్రయాలకు ఈమెయిల్ ద్వారా ఇలాంటి తప్పుడు బాంబు బెదిరింపులు వచ్చాయి. జూన్ 18న ఇండిగో ఎయిర్‌లైన్స్ కస్టమర్ సర్వీస్ సెంటర్ చాట్‌లో ఒక వ్యక్తి చెన్నై నుండి ముంబైకి వెళ్లే విమానంలో బాంబు పెడతానని బెదిరించాడు. ఆ తర్వాత విమానాశ్రయంలో భద్రతను పెంచారు.. దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే దర్యాప్తులో ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు.

Read Also:Health Tips : పెప్పర్ రైస్ ను తింటున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి…

విమానంలో బాంబు బెదిరింపు చేసిన వ్యక్తి తమిళనాడు వాసి, తంజావూరు జిల్లా తిరువయ్యారు నివాసి. తప్పుడు బాంబు బెదిరింపు ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తిని 27 ఏళ్ల వి ప్రసన్నగా గుర్తించారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ బృందం ప్రసన్నను అరెస్ట్ చేసింది. చెన్నై-ముంబై విమానంలో బాంబు పెట్టినట్లు కస్టమర్ సర్వీస్ సెంటర్ చాట్‌లో ప్రసన్న పేర్కొన్నాడు.

Read Also:Legal Notices: మంత్రి పొన్నంపై ఆరోపణలు.. పాడి కౌశిక్ రెడ్డికి లీగల్‌ నోటీసులు..

అదే రోజు అంటే జూన్ 18న దేశవ్యాప్తంగా ఉన్న మరో 41 విమానాశ్రయాల్లో ఈమెయిల్ ద్వారా ఇలాంటి తప్పుడు బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత అన్ని విమానాశ్రయాలను తనిఖీ చేసి భద్రతను పెంచారు. విచారణలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నకిలీ బాంబు బెదిరింపులు చేసే వారిపై 5 సంవత్సరాల ఫ్లయింగ్ నిషేధాన్ని విధించాలని ప్రతిపాదించింది. ఎందుకంటే ఇటువంటి తప్పుడు బెదిరింపులు విమాన సమయంలో చాలా సమస్యలను కలిగిస్తాయి. ఈ కేసులో సైబర్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు నమోదు చేయగా ప్రసన్నను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Accused arrested
  • cyber crime branch
  • hoax bomb threat
  • indigo airlines
  • Tamil Nadu

తాజావార్తలు

  • Vijay Antony: బిచ్చగాడు కాంబో రిపీట్

  • Aishwarya Lekshmi: పెళ్లి కంటే అదే బెటర్.. హీరోయిన్ షాకింగ్ స్టేట్‌మెంట్!

  • SS Rajamouli: “ఆ సీన్ అదిరింది రణవీర్”.. ధురందర్ 2పై జక్కన్న రియాక్షన్.. ఆదిత్య ధర్ రిప్లై!

  • TATA Harrier EV: భారతీయ EV మార్కెట్‌లో కింగ్? టాటా హారియర్ EV ఫియర్‌లెస్+ QWD 75 విడుదల.. ధర, ఫీచర్స్ ఇవే

  • PM Modi: “మా నాన్న మోడీ చెబితేనే వింటారు”.. ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్‌పై స్పందించిన ప్రధాని.. ప్రజలకు కీలక విజ్ఞప్తి!

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions