Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Tamil Nadu Election 2026 Vijay Tvk Coalition Government Congress Support

Vijay TVK Government: టీవీకే విజయ్‌కి కాంగ్రెస్ షరతులు.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక మలుపు!

Published Date :May 6, 2026 , 7:47 am
By RAMAKRISHNA KENCHE
Vijay TVK Government: టీవీకే విజయ్‌కి కాంగ్రెస్ షరతులు.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక మలుపు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vijay TVK Government: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు విజయ్. దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని శాసించిన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ, దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. 234 స్థానాలున్న అసెంబ్లీలో 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే.. అటు డీఎంకేను ఓడించి, ఇటు ఏఐఏడీఎంకేను మూడో స్థానానికి నెట్టేసి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118)కు కేవలం పది సీట్ల దూరంలో విజయ్ పార్టీ నిలిచిపోవడంతో రాష్ట్రంలో సంకీర్ణ రాజకీయాలు ఊపందుకున్నాయి.

ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజా ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, విజయ్ ప్రభుత్వానికి బేషరతుగా కాకుండా కొన్ని షరతులతో కూడిన మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కాంగ్రెస్ ఓ తీర్మానాన్ని సైతం ఆమోదించింది. ఈ మద్దతుకు ప్రతిఫలంగా మంత్రివర్గంలో రెండు బెర్తులు, అలాగే కొన్ని ప్రభుత్వ బోర్డుల ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక మద్దతు లేఖ బుధవారం విడుదల కానుంది. ఆ వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనైయూర్‌లోని టీవీకే రాజకీయ కార్యాలయానికి వెళ్లి విజయ్‌తో భేటీ కానున్నారు.

Also Read

  • Kolkata: కోల్‌కతాలో బుల్డోజర్ల గర్జన.. అర్ధరాత్రి టీఎంసీ ఆఫీసు నేలమట్టం!
  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే...
  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

మరోవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు విజయ్ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. తన నివాసంలో నూతన ఎమ్మెల్యేలతో సమావేశమై మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘంగా చర్చించారు. అందుతున్న సమాచారం ప్రకారం.. మే 7వ తేదీన విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌తో పాటు వీసీకే, సీపీఐ(ఎం), సీపీఐ, ఐయూఎంఎల్ వంటి వామపక్ష, ప్రాంతీయ పార్టీలతోనూ టీవీకే చర్చలు జరుపుతోంది. ఈ పార్టీలన్నీ కలిస్తే విజయ్ నేతృత్వంలోని కూటమి బలం మెజారిటీ మార్కును సులువుగా దాటుతుంది.

అయితే, తమ మిత్రపక్షాలైన వామపక్షాలు, వీసీకేలు విజయ్ వైపు వెళ్లవని డీఎంకే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్ నిర్ణయంపై మాత్రం ఆ పార్టీ పెదవి విప్పడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ తన మద్దతుపై టీవీకే నాయకత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపిన నేపథ్యంలో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దశాబ్దాల ద్రవిడ కోటను బద్దలు కొట్టిన విజయ్, ఒక స్థిరమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress support TVK
  • DMK AIADMK defeat
  • Tamil Nadu Elections 2026
  • Tamil politics change
  • TN coalition politics

తాజావార్తలు

  • Vijay TVK Government: టీవీకే విజయ్‌కి కాంగ్రెస్ షరతులు.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక మలుపు!

  • Theaters: తెలుగు రాష్ట్రాల్లో మూతపడుతున్న థియేటర్లు..

  • Kalita Majhi: ఇళ్లలో పనిమనిషి నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన కలితా మాజీ.. ఈమె ఎవరు?

  • Kolkata: కోల్‌కతాలో బుల్డోజర్ల గర్జన.. అర్ధరాత్రి టీఎంసీ ఆఫీసు నేలమట్టం!

  • Salman Khan: సల్మాన్ ఖాన్ ‘SVC63’లో పవర్‌ఫుల్ విలన్..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions