Tamil Nadu Crime: తమిళనాడులో దారుణం.. కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Couples killed 3 days after wedding in Tamil Nadu: తమిళనాడులోని తూత్తుకూడి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో.. సొంత కుటుంబ సభ్యులే ఓ యువతి, యువకుడిని దారుణంగా చంపారు. నిద్రిస్తున్న సమయంలో ఇంటిలోకి చొరబడిన యువకులు.. కొత్త జంటను దారుణంగా చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దీనిని పరువు హత్యగా భావిస్తున్నారు.
తూత్తుకూడికి చెందిన కార్తీక (20), సేల్వం (24) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కలిసి జీవించాలుకున్న వారు.. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం తల్లిదండ్రులు చెబితే.. కార్తీక కుటుంబ సభ్యులు ఓప్పుకోలేదు. ఒకరినివిడిచి మరొకరు ఉండలేని వారు.. అక్టోబరు 31న ఇంటి నుండి వెళ్లిపోయారు. కార్తీక, సేల్వం మూడురోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లయినప్పటి నుంచి మురుగేషన్ నగర్‌లో వారు ఉంటున్నారు. కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని కార్తీక కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు.
Also Read
- బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
Also Read: Rohit Sharma: మా మొదటి లక్ష్యం నెరవేరింది.. ఇక ముందుంది అసలు పండగ: రోహిత్
కొత్త జంట కార్తీక, సేల్వం తూత్తుకూడిలో ఇంట్లో నిద్రిస్తన్న సమయంలో ఆరుగురు యువకులు లోపలి చొరబడ్డారు. కార్తీక, సేల్వంన దారుణంగా చంపి పరారీ అయ్యారు. విషయం తెలిసిన సేల్వం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నారు అయ్యారు. కార్తీక తల్లిదండ్రులుపై అనుమానం వ్యక్తం చేస్తూ.. సేల్వం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బాలాజీ, రూరల్ డిప్యూటీ సూపరింటెండెంట్ సురేశ్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రెండు మోటర్‌బైక్‌లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు హత్యకు పాల్పడ్డారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
తాజావార్తలు
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
-
Pocharam Srinivas Reddy: “అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా”.. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
-
Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!