CP Radhakrishnan: దేశానికి తమిళనాడు నుంచి ప్రధాని.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
- భవిష్యత్తులో తమిళనాడు నుంచి ప్రధానమంత్రి రావొచ్చు..
- భారత ప్రజాస్వామ్యంలో ప్రతీ పౌరుడికి ప్రధాని అయ్యే అవకాశం ఉంది..
- ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CP Radhakrishnan: భారతదేశానికి భవిష్యత్తులో తమిళనాడు నుంచి ప్రధానిమంత్రి వచ్చే అవకాశం ఉందని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. భారత ప్రజాస్వామ్యంలో ప్రతీ పౌరుడికి దేశాన్ని నడిపించే అవకాశం ఉంటుందని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు ఇప్పటికే ప్రధానమంత్రి పదవిని చేపట్టారని ఆయన గుర్తుచేశారు.
శుక్రవారం మదురైలో జరిగిన మీడియా సమావేశంలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కర్ణాటక నుంచి వచ్చారని, ప్రస్తుత ప్రధాని మోడీ గుజరాత్ నుంచి వచ్చారని ఆయన అన్నారు. ఇప్పటి వరకు తమిళనాడు నుంచి ఒక్కరు కూడా ప్రధానమంత్రి కాలేదని, రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రాష్ట్రపతులుగా, మరో ముగ్గురు ఉప రాష్ట్రపతులుగా పనిచేశారని చెప్పారు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా తమిళనాడుకు చెందినవారే. 1998 నుంచి 2004 వరకు కోయంబత్తూరు బీజేపీ ఎంపీగా కూడా పనిచేశారు.
Also Read
- Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
- Digvijaya Singh: "హిందూత్వం సమాజంలో ద్వేషాన్ని పెంచుతుంది".. దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
- Supreme Court: తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. విచారణను ఏపీ వెలుపలికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల పవర్ ఫుల్ నిర్ణయం.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జంతర్ మంతర్ రోడ్డు..
తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో కలిసి ఉప రాష్ట్రపతి మదురైలోని మీనాక్షి సుందరేశ్వర ఆలయాన్ని సందర్శించారు. తర్వాత మదురైకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసుంపోన్లో స్వాతంత్ర్య సమరయోధుడు, ఆధ్యాత్మిక నాయకుడు ముత్తురామలింగ తేవర్ స్మారక స్థలాన్ని సందర్శించారు. ముత్తురామలింగ తేవర్‌ను నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ప్రధాన అనుచరుడని రాధాకృష్ణన్ అభివర్ణించారు. తమిళ ప్రాంతంలో జాతీయ, ఆధ్యాత్మక చైతన్యం పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ ముత్తురామలింగ తేవర్ రాజకీయ ప్రయోజనాల కోసం తన సిద్ధాంతాలను, విలువలను ఎప్పుడూ రాజీపడలేదని తెలిపారు.
తాజావార్తలు
-
Doping Test: డోపింగ్ పరీక్షలో దొరికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. కానీ ఓ ట్విస్ట్!
-
AP MPTC and ZPTC Elections: ఎన్నికల వేళ ఉద్రిక్తత.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురిపై కేసులు.. మరికొందరు అరెస్ట్..!
-
IPL Players Retention Fee: ఐపీఎల్లో మరో సంచలనం.. రూ.40 కోట్లు కావాలంటున్న టాప్ ప్లేయర్లు!
-
Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికా ముందు ఏడు షరతులు..
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
ట్రెండింగ్
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!