Doping Test: డోపింగ్ పరీక్షలో దొరికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. కానీ ఓ ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chris Lynn Ban: ఆస్ట్రేలియా స్టార్ టీ20 క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ ప్లేయర్ క్రిస్ లిన్‌కు షాక్ తగిలింది. క్రిస్ లిన్ డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు. కొకైన్ వినియోగించినట్లు పరీక్షల్లో తేలడంతో అతడిపై నెల రోజుల నిషేధం విధించినట్లు ఇంగ్లండ్ క్రికెట్ రెగ్యులేటర్ శుక్రవారం వెల్లడించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ నిషేధ కాలం ఇప్పటికే పూర్తయింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ రెగ్యులేటర్ అధికారికంగా తెలిపింది.
ఇంగ్లండ్‌లో జరిగిన టీ20 బ్లాస్ట్ ఫైనల్స్ సందర్భంగా జూలై 18న నిర్వహించిన సాధారణ యాంటీ డోపింగ్ పరీక్షలో 36 ఏళ్ల క్రిస్ లిన్ పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతడు నార్తాంప్టన్‌షైర్ జట్టు తరఫున ఆడుతున్నాడు. పరీక్షల్లో కొకైన్కు సంబంధించిన మెటాబొలైట్ అయిన బెంజాయిలెక్గోనైన్ స్వల్ప స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆరోపణను లిన్ అంగీకరించినట్లు క్రికెట్ రెగ్యులేటర్ వెల్లడించింది. ఈ వ్యవహారంలో తొలుత మూడు నెలల నిషేధం విధించే అవకాశం ఉన్నప్పటికీ.. లిన్ పునరావాస కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో పాటు ఈ ఘటన పోటీకి వెలుపల జరిగిందని, అతడి క్రీడా ప్రదర్శనను మెరుగుపరచడానికి సంబంధం లేదని రెగ్యులేటర్ నిర్ధారించింది. దీంతో నిషేధాన్ని నెల రోజులకు తగ్గించింది. ఇప్పటికే ఆ గడువు పూర్తయినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.
Also Read
- IPL Players Retention Fee: ఐపీఎల్లో మరో సంచలనం.. రూ.40 కోట్లు కావాలంటున్న టాప్ ప్లేయర్లు!
- IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
- IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
- Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
క్రిస్ లిన్ ఆస్ట్రేలియా తరఫున 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు, నాలుగు వన్డేలు ఆడాడు. ప్రపంచవ్యాప్తంగా పలు టీ20 లీగ్‌లలోనూ తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2021లో ముంబై ఇండియన్స్ తరఫున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆడటమే ఐపీఎల్లో అతడి చివరి మ్యాచ్. మరోవైపు బిగ్ బాష్ లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్ లిన్‌కు మంచి గుర్తింపు ఉంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న బిగ్ బాష్ లీగ్ సీజన్లో అతడు మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టులో చేరే అవకాశం ఉంది. అయితే నిషేధం పూర్తయిన నేపథ్యంలో అతడి తదుపరి క్రికెట్ ప్రయాణంపై ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Doping Test: డోపింగ్ పరీక్షలో దొరికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. కానీ ఓ ట్విస్ట్!
-
AP MPTC and ZPTC Elections: ఎన్నికల వేళ ఉద్రిక్తత.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురిపై కేసులు.. మరికొందరు అరెస్ట్..!
-
IPL Players Retention Fee: ఐపీఎల్లో మరో సంచలనం.. రూ.40 కోట్లు కావాలంటున్న టాప్ ప్లేయర్లు!
-
Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికా ముందు ఏడు షరతులు..
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
ట్రెండింగ్
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!