Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకుగాన 950 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే, టీవీకే మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఐదేళ్లకు ఒకసారి అధికారాన్నీ మార్చేసే తీర్పునిచ్చే తమిళ తంబీలు ఈ సారి ఏ పార్టీకి అధికారం కట్టబెడతారోనని ఉత్కంఠ నెలకొంది. ఈ త్రిముఖ పోటీలో ఏ పార్టీ బలం ఎంత.. ఎవరు అధికారాన్ని చేజిక్కించుకుంటారో తెలుసుకుందాం..
DMK : అధికార DMK పార్టీ 14 పార్టీలతో కలిసి ఈసారి ఎన్నికల బరిలో నిలిచింది. 164 స్థానాల్లో DMK సొంతగా పోటీ చేస్తూ మిగిలిన స్థానాల్లో కూటమి అభ్యర్థులు పోటీచేస్తున్నారు. స్థూలంగా పరిశీలిస్తే DMK కేత్రస్థాయిలో బలంగా ఉన్న పార్టీ. తన ఐదేళ్ల పాలనలో అభివుద్దితో పాటు సంక్షేమ పథకాలను అందించడంలో స్టాలిన్ సక్సెస్ అయ్యారు. తమిళ జాతీయ వాదం ఈ పార్టీకి కలిసొచ్చే మరొక అంశం. మధ్యతరగతి వర్గాలు డీఎంకే పట్ల సానుకులంగా ఉన్నాయి. అలాగే ముస్లిమ్ మైనారిటీలు మద్దతూ కూడా ఈ పార్టీకి ఎక్కువ ఉంది. దక్షిణతమిళనాడులో ప్రధాన కులాన్ని డీఎంకే తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. పోల్ మేనేజిమెంట్ లోను డీఎంకే చాలా స్ట్రాంగ్ గా ఉంది. హిందీ వ్యతిరేక ఉద్యమంతో తమిళ ఆత్మగౌరవం అంటే డీఎంకే అనే భావాన్ని ప్రజలలో కలిగించారు. అయితే అవినీతి ఆరోపణలు, హిందూ వ్యతిరేక సంఘటనలు, మహిళపై అఘాయిత్యాలు వంటివి పెరగడం, డ్రగ్స్ వంటివి రాష్ట్రంలో పెరిగాయి. అలాగే ఉద్యోగులలో కొంత వ్యతిరేకత ఆ పార్టీకి నెగిటివ్ అంశాలుగా చెప్పుకోవచ్చు..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
AIADMK : మాజీ ముక్యమంత్రి జయలలిత మరణంగా ప్రభావం కోల్పోయిన అన్నాడీఎంకే పార్టీకి ఇప్పటికి గ్రౌండ్ లెవల్ క్యాడర్ బలంగా ఉంది. పన్నిర్ సెల్వం, పళనిస్వామి మధ్య విభేదాలతో క్యాడర్ లో కొంత చీలిక వచ్చిన పాలినిస్వామి పార్టీని, కార్యకర్తలను ఒకతాటిపైకి తేగలిగారు.ఈ ఎన్నికల్లో 166 స్థానాల్లో పోటీ చేస్తున్న అన్నాడీఎంకేకు బీజేపీ, అన్బుమణి రామదాస్ పార్టీ పీఎంకే మద్దుతు కాస్త కలిసొచ్చే అంశం. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్, TVK విజయ్ మాదిరిగా అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళినిస్వామికి మాస్ అప్పీరియయన్స్ లేదు. అలాగే విజయ్ పార్టీ నుండి అన్నాడీఎంకేకు భారీ ముప్పు పొంచి ఉందని పొలిటికల్ విశ్లేషకుల అభిప్రాయం.
TVK : సినీ నటుడు విజయ్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సినిమాలలో స్టార్ గా కొనసాగుతున్న విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వడంతో తమిళనాడు పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉండడం, అలాగే క్రిస్టియన్ మైనారిటీ ఓట్ బ్యాంక్ విజయ్ కు బిగ్ అడ్వాంటేజ్. యువత, మహిళలు విజయ్ కు మద్దతు ఉంది. అలాగే పార్టీకి గ్రామ స్థాయిలో ఓట్ బ్యాంక్ లేకపోవడం, బూత్ లెవల్ లో క్యాడర్ లేకపోవడం విజయ్ పార్టీకి నెగిటివ్ అంశం. దానికి తోడు కరూర్ తొక్కిసలాట, భార్యతో విడాకులు, త్రిషతో వ్యవహారం విజయ్ ను ఇబ్బందిపెట్టె అంశాలు. కానీ వాటిని ప్రజలు ఎంతవరకు పట్టించుకుంటారు అనేది చెప్పలేం. మరోవైపు విజయ్ సభలకు భారీగా జనం వస్తున్నారు కానీ అవి ఎంతవరకు ఓట్లుగా మారతాయనేది చూడాలి. దానికి తోడు విజయ్ పార్టీలో టికెట్లు పొందిన వారు డీఎంకే, అన్నాడీఎంకే నుండి వచ్చిన వారు కేవలం డిజిటిల్ మీడియాపై ఎక్కవ ఆధారపడి ఎన్నిలకు వెళ్తున్నారు విజయ్.
విశ్లేషకుల అభిప్రాయం : అధికార డీఎంకే పార్టీపై ఉన్న వ్యతిరేక ఓటు బ్యాంకును కొత్తగా వచ్చిన TVK పార్టీ విజయ్ చీల్చడం డీఎంకే కు ప్లస్ పాయింట్. కానీ అది అన్నాడీఎంకేకు భారీ నష్టం కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే విజయ్ కు కూడా భారీగా ఓట్లు పడతాయని.. మొత్తంగా చూస్తే డీఎంకే కొంత సానుకూల పవనాలు ఉన్నా కూడా తమిళ తంబీలు ఎప్పుడు ఎవరికీ అధికారం కట్టబెడతారో ఎవరికీ ఎలాంటి షాక్ ఇస్తారో చెప్పలేమని తెలిపారు. ఈ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారో మే4న తెలుస్తుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?