Delimitation: తమిళనాడులో డీలిమిటేషన్ (Delimitation) అంశంపై అఖిలపక్ష సమావేశం కీలక తీర్మానాలను ఆమోదించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేపట్టారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని, రాబోయే 30 ఏళ్లపాటు అదే అమల్లో ఉండాలని స్టాలిన్ స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశంలో ప్రస్తుత లోక్‌సభలో ఉన్న 543 సీట్లనే కొనసాగించాలని తీర్మానించారు. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల నష్టపోకుండా ఉండాలని, ఇతర దక్షిణాది రాష్ట్రాలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించారు.
Read Also: MLC Ravindra Babu: వైసీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియపై గత కొంతకాలంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాదికి తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడ్డాయి. అయితే, బీజేపీ ఈ డీలిమిటేషన్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని వాదిస్తోంది. అయితే, డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా ప్రధాని నరేంద్ర మోడీ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని స్టాలిన్ కోరారు. గత 50 ఏళ్లుగా కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసిన తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలకు ఈ నిర్ణయం శిక్షగా మారకూడదని స్టాలిన్ స్పష్టం చేశారు.
Read Also: RS Brothers: అత్తాపూర్లో ఆర్ఎస్ బ్రదర్స్ 13వ షోరూం ఓపెన్ చేసిన నిధి అగర్వాల్!
ఈ తీర్మానాన్ని ప్రధాని మోడీకి పంపడమే కాకుండా, ప్రజల్లో చైతన్యం కలిగించే చర్యలు చేపట్టనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. ఈ డీలిమిటేషన్ అంశంపై జరిగిన అఖిలపక్ష సమావేశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లకుండా కేంద్రంతో పోరాటానికి దక్షిణాది నాయకులు సమాయత్తమవుతున్నారు. మొత్తం మీద ఈ డీలిమిటేషన్ అంశం దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర రాజకీయం రేపే అవకాశాలున్నాయి.