Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Tamil Nadu All Party Meeting Passes Resolution Against Delimitation Row Cm Mk Stalin Demands 1971 Census Basis

Delimitation Row: డీలిమిటేష‌న్‌పై తమిళనాడు అఖిలపక్ష సమావేశంలో కీల‌క నిర్ణ‌యాలు

Published Date :March 5, 2025 , 5:39 pm
By Kothuru Ram Kumar
  • తమిళనాడు అఖిలపక్ష సమావేశంలో కీలక తీర్మానాలు.
  • డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అఖిలపక్ష తీర్మానం.
  • 1971 జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలి.
  • 30 ఏళ్ల పాటు డీలిమిటేషన్ అమల్లో ఉండాలి: సీఎం స్టాలిన్
Delimitation Row: డీలిమిటేష‌న్‌పై తమిళనాడు అఖిలపక్ష సమావేశంలో కీల‌క నిర్ణ‌యాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Delimitation: తమిళనాడులో డీలిమిటేషన్ (Delimitation) అంశంపై అఖిలపక్ష సమావేశం కీలక తీర్మానాలను ఆమోదించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేపట్టారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని, రాబోయే 30 ఏళ్లపాటు అదే అమల్లో ఉండాలని స్టాలిన్ స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశంలో ప్రస్తుత లోక్‌సభలో ఉన్న 543 సీట్లనే కొనసాగించాలని తీర్మానించారు. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల నష్టపోకుండా ఉండాలని, ఇతర దక్షిణాది రాష్ట్రాలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించారు.

Read Also: MLC Ravindra Babu: వైసీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు

కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియపై గత కొంతకాలంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాదికి తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయపడ్డాయి. అయితే, బీజేపీ ఈ డీలిమిటేషన్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని వాదిస్తోంది. అయితే, డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా ప్రధాని నరేంద్ర మోడీ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని స్టాలిన్ కోరారు. గత 50 ఏళ్లుగా కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసిన తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలకు ఈ నిర్ణయం శిక్షగా మారకూడదని స్టాలిన్ స్పష్టం చేశారు.

Read Also: RS Brothers: అత్తాపూర్లో ఆర్ఎస్ బ్రదర్స్ 13వ షోరూం ఓపెన్ చేసిన నిధి అగర్వాల్!

ఈ తీర్మానాన్ని ప్రధాని మోడీకి పంపడమే కాకుండా, ప్రజల్లో చైతన్యం కలిగించే చర్యలు చేపట్టనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. ఈ డీలిమిటేషన్ అంశంపై జరిగిన అఖిలపక్ష సమావేశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లకుండా కేంద్రంతో పోరాటానికి దక్షిణాది నాయకులు సమాయత్తమవుతున్నారు. మొత్తం మీద ఈ డీలిమిటేషన్ అంశం దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర రాజకీయం రేపే అవకాశాలున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • All Party Meeting
  • Delimitation
  • Delimitation Row
  • MK Stalin
  • Narendra Modi

తాజావార్తలు

  • Hyderabad: హైకోర్టు జోన్‌-2 పనులకు శంకుస్థాపన..!

  • RCB vs CSK Playing 11: ఫామ్‌లో ఆర్‌సీబీ, సీఎస్‌కేకు విజయం తప్పనిసరి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11 ఇదే!

  • Khawaja Asif: తినడానికి తిండి లేదు కానీ.. కోల్‌కతాపై దాడి చేస్తారట! పాక్ రక్షణ మంత్రి “బలుపు” మాటలు..

  • Rashmika Mandanna : రష్మిక బర్త్ డే స్పెషల్.. జయమ్మకు రణబాలి టీమ్ సర్ప్రైజ్ గిఫ్ట్

  • AP High Court: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు అనుమతి లేదు.. అధికారులకు హైకోర్టు ఆదేశం!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions